ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలింది. అయిదే ఇందులో తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలింది. మెుత్తం అన్నింటి నిర్మాణం కోసం కేంద్రం రూ.5,863 కోట్లు కేటాయించనుందని తెలుస్తోంది.
ఈ ప్రాంతాల్లో కేంద్రం కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం(యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం(గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా- రూరల్ మండలం చెల్గల, వనపర్తి జిల్లా - నాగవరం శివారు ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. వీటిలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, మూడు ఏళ్ల ప్రాథమిక ప్రీ-ప్రైమరీ తరగతులైన బాల్వటికలను కలిగి ఉంటాయి.
తెలంగాణకు కేటాయించిన నాలుగు కేంద్రీయ విద్యాలయాల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడుగా మరో నాలుగు వస్తున్నాయన్నారు. ఈ నాలుగు విద్యాలయాలు మారుమూల ప్రాంతాల్లో నాణ్యమైన ప్రాథమిక, సెకండరీ విద్యను అందిస్తాయని చెప్పారు.
'రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో నాణ్యమైన సెకండరీ విద్యను అందించడానికి రూ.400 కోట్లతో 832 పీఎం-శ్రీ స్కూల్స్ మంజూరు చేసింది. సమగ్రశిక్షా అభియాన్ కింద రెండేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లు కేటాయించింది. దాదాపు రూ.వెయ్యి కోట్లతో ములుగు జిల్లాల్లో సమ్మక్క, సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది.' అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
వీటి వలన 86,000 మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. రూ. 5,862 కోట్ల వ్యయంతో కూడిన ఈ కేంద్రీయ విద్యాలయాలలో బల్వాటికస్ ఉన్నాయి. 4,600 కంటే ఎక్కువ ఉద్యోగాలను వస్తాయి.