కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో...దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగులకు ఉద్యోగ ఆధారిత సాంకేతిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ కోర్సుల్లో ఆసక్తి చూపిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 29లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ,హాస్టల్, భోజన వసతితో పాటు ఉద్యోగం కల్పిస్తారు.
1. వయస్సు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. గ్రామీణ అభ్యర్థులై ఉండాలి.
3. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు.
1. అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్
2. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
3. ఆధార్ కార్డు
4. రేషన్ కార్డు
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్ (గ్రామం), పోచంపల్లి (మం) యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ - 508 284
సంబంధిత కథనం