గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి(అక్టోబర్ 3) నుంచి ప్రారంభమైంది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా 17 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటిలో సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, వెటర్నరీ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ (ఐటీ), డేటా అనలిస్ట్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ వంటి పోస్టులున్నాయి.ఈ పోస్టులకు అక్టోబర్ 18, 2025 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ముగుస్తుంది. నిర్దేశించిన గడువులోపు అభ్యర్థులు వారి ధ్రువపత్రాలను కూడా గా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం