GATE Admit Card 2025 : గేట్ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. ఈ స్కోరుతో ప్రవేశాలే కాదు.. ఉద్యోగాలు కూడా!
GATE admit card 2025 : గేట్ 2025 పరీక్ష అడ్మిట్ కార్డులను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(GATE)2025 పరీక్ష అడ్మిట్ కార్డులను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సు్ల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష స్కోర్ ఉపయోగపడుతుంది. అభ్యర్థులు gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌లో మీ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ అప్లికేషన్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. గేట్‌లో అర్హత సాధించడం ద్వారా ఐఐటీల నుంచి ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీలో ప్రవేశం పొందడమే కాకుండా.. ఈ స్కోర్ ఆధారంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు, స్కాలర్ షిప్‌లు కూడా లభిస్తాయి.
గేట్ ప్రవేశానికి పరీక్షలను ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో, మధ్యాహ్నం షిఫ్టులో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 19న ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 28 నుంచి మే 31 వరకు స్కోర్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గేట్ పరీక్ష వ్యవధి 3 గంటలు. గేట్ స్కోరు మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్ విద్యార్థులు, వారు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నాలకు 15 మార్కులు, టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకు 85 మార్కులతో ఉంటుంది. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. 1 మార్కు ప్రశ్నలకు తప్పు సమాధానికి 1/3, 2 మార్కుల ప్రశ్నలకు తప్పు సమాధానికి 2/3 చొప్పును కొత ఉంటుంది.
గేట్ స్కోర్ ద్వారా ఎంటెక్ ప్రవేశాలు పొందిన విద్యార్థుకు నెలకు రూ.12,400 చొప్పను స్కాలర్‌షిప్ కూడా దొరుకుతుంది. ఐఐటీల్లో గేట్ స్కోరుతో పీహెచ్‌డీలోనూ ప్రవేశాలు ఉంటాయి. ఎస్టీ, ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎంఎన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ) విభాగంలో తప్పు సమాధానాలు ఇస్తే నెగెటివ్ మార్కింగ్ చేస్తారు.
ఒక మార్కు ఎంసీక్యూ ప్రశ్నకు తప్పుగా సమాధానమిస్తే మూడింట ఒక వంతు మార్కులు కోత విధిస్తారు. 2 మార్కులతో కూడిన ప్రతి ఎంసీక్యూ ప్రశ్నకు ప్రతి తప్పు సమాధానానికి మూడింట రెండు వంతుల మార్కులు కోత విధిస్తారు. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్(ఎంఎస్‌క్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్(నాట్) ప్రశ్నలకు తప్పుగా సమాధానాలు ఇచ్చినట్లయితే నెగిటివ్ మార్క్ చేయరు.