GATE 2026 అప్లికేషన్​ మిస్​ అయ్యారా? ఇంకా ఛాన్స్​ ఉంది..-gate 2026 application window with late fee extended see details inside ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Gate 2026 అప్లికేషన్​ మిస్​ అయ్యారా? ఇంకా ఛాన్స్​ ఉంది..

GATE 2026 అప్లికేషన్​ మిస్​ అయ్యారా? ఇంకా ఛాన్స్​ ఉంది..

Sharath Chitturi HT Telugu

GATE 2026 రిజిస్ట్రేషన్​ ఛాన్స్​ మిస్​ చేసుకున్న వారికి గుడ్‌న్యూస్! ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువును ఐఐటీ గౌహతి పొడిగించింది. అప్లికేషన్​కి చివరి తేదీ, ఆలస్య రుసుముతో పాటు పరీక్షకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

గేట్​ 2026 అప్లికేషన్​కి ఇంకా ఛాన్స్​ ఉంది!

గేట్ 2026 (గ్రాడ్యుయేట్​ యాప్టిట్యూడ్​ టెస్ట్​ ఇన్​ ఇంజినీరింగ్​ పరీక్ష దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి. ఆలస్య రుసుముతో అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం!

గేట్​ 2026 రాయాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు అక్టోబర్ 13, 2025 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అయితే, ఇందుకోసం నిర్దేశించిన అదనపు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఐఐటీ అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

గతంలో, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 9, 2025 వరకు ఉండేది. దాన్ని పొడిగిస్తున్నట్టు ఐఐటీ గౌహతి తెలిపింది.

గేట్​ 2026- దరఖాస్తు రుసుము..

పొడిగించిన దరఖాస్తు గడువులో అభ్యర్థులు చెల్లించాల్సిన ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి:

  • మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు: ఒక్కో టెస్ట్ పేపర్‌కు రూ. 1,500
  • ఇతరులు (విదేశీ పౌరులతో పాటు): ఒక్కో టెస్ట్ పేపర్‌కు రూ. 2,500
  • ఈ ఫీజును అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

గేట్​ 2026- పరీక్ష తేదీలు, ఫలితాలు..

ఈ ఏడాది గేట్ 2026 పరీక్షను నిర్వహించే సంస్థగా ఐఐటీ గౌహతి వ్యవహరిస్తోంది. గేట్ 2026 పరీక్షను ఫిబ్రవరి 7, 8, 14, 15, 2026 తేదీల్లో నిర్వహించడానికి ఐఐటీ గౌహతి షెడ్యూల్ చేసింది. ఈ పరీక్ష ఫలితాలను మార్చి 19, 2026 న ప్రకటించనున్నారు.

గేట్ 2026- దరఖాస్తు చేసే విధానం..

గేట్ 2026 పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కింద తెలిపిన దశలను అనుసరించాలి:

స్టెప్​ 1- ముందుగా, అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.in ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో కనిపించే 'GATE 2026 రిజిస్ట్రేషన్' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- మీ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయండి.

స్టెప్​ 4- అనంతరం, దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపి, దరఖాస్తు రుసుము చెల్లించండి.

స్టెప్​ 5- ఫారమ్‌ను సమర్పించి, ఆ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్​ 6- భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింటౌట్‌ను భద్రంగా ఉంచుకోండి.

మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐఐటీ గేట్ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని సూచించడమైనది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం