GATE 2025 Results Out : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ నిర్వహించిన గేట్ 2025(Gate 2024 Results) ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఫలితాలను gate2025.iitr.ac.in, goaps.iitr.ac.in వెబ్ సైట్స్ లో చెక్ చేసుకోవచ్చు. https://goaps.iitr.ac.in/login ఈ డైరెక్ట్ లింక్ లో అభ్యర్థి లాగిన్ అయ్యి స్కోరు, అర్హత (పాస్/ఫెయిల్) , సబ్జెక్ట్, కేటగిరీకి కట్-ఆఫ్ మార్కులు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. గేట్ 2025 ఫలితాలను చెక్ చేసుకునేందుకు అభ్యర్థి ఎన్‌రోల్‌మెంట్ ఐడీ/ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
గేట్ 2025 స్కోర్‌కార్డ్‌లు మార్చి 28 నుంచి మే 31, 2025 వరకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. గేట్ 2025 పరీక్షలు ఫిబ్రవరి 1, 2, 15, 16, తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహించబడింది. రెండు సెషన్‌లలో పరీక్షలు జరిగాయి. ఉదయం 9:30 నుండి 12:30 వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించారు. గేట్ పరీక్షలకు ఐఐటీ రూర్కీ ఫిబ్రవరి 27న తాత్కాలిక కీని విడుదల చేసింది. మార్చి 1 వరకు ఈ కీ పై అభ్యంతరాలు స్వీకరించింది. అభ్యర్థులు అభ్యతంరాలు సమీక్షించి తుది కీని విడుదల చేశారు.
1. https://gate2025.iitr.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. హోమ్ పేజీలో GOAPS అప్లికేషన్ పోర్టల్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
4. మీ ఫలితాన్ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
5. భవిష్యత్తు అవసరం కోసం ప్రింటవుట్‌ను తీసుకోండి.
మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన గేట్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఏడాది గేట్ పరీక్షలను ఐఐటీ రూర్కీ నిర్వహించింది. బుధవారం మధ్యాహ్నం గేట్ ఫలితాలను విడుదల అయ్యాయి.
మొత్తం 30 సబ్జెక్టులకు గేట్ పరీక్షను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 8.37 లక్షల మంది గేట్ కు దరఖాస్తు చేసుకోగా సుమారు 80 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు సమాచారం. మార్చి 28 నుంచి మే 31 వరకు స్కోర్ కార్డులు అందుబాటులో ఉంటాయి. ఈ వ్యవధి ముగిసిన అనంతరం స్కోర్ కార్డులు డౌన్‌లోడ్ కోసం ప్రతి పేపర్‌కు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం