GATE 2025 results: రేపే గేట్ 2025 ఫలితాలు; మీ స్కోర్ ను ఇలా చెక్ చేసుకోండి..-gate 2025 result by tomorrow at gate2025 iitr ac in heres how to check scores ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Gate 2025 Results: రేపే గేట్ 2025 ఫలితాలు; మీ స్కోర్ ను ఇలా చెక్ చేసుకోండి..

GATE 2025 results: రేపే గేట్ 2025 ఫలితాలు; మీ స్కోర్ ను ఇలా చెక్ చేసుకోండి..

Sudarshan V HT Telugu

GATE 2025 results: గేట్ 2025 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు గేట్ 2025 అధికారిక వెబ్సైట్ gate2025.iitr.ac.in. లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అందుకు అనుసరించాల్సిన స్టెప్స్ ను కింద వివరించాం, చూడండి..

రేపే గేట్ 2025 ఫలితాలు (Getty Images/iStockphoto)

GATE 2025 results: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ లేదా గేట్ 2025 ఫలితాలను రేపు, మార్చి 19, 2025 న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ విడుదల చేయనుంది. గేట్ 2025 ఫలితాలను అభ్యర్థులు గేట్ 2025 అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఐఐటీ రూర్కీ గేట్ 2025 ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఫిబ్రవరి 27న విడుదల చేసి మార్చి 1న అభ్యంతర విండోను మూసివేసింది. అభ్యర్థులు పంపిన ఫీడ్ బ్యాక్ ను సబ్జెక్టు నిపుణులు సమీక్షించి అవి చెల్లుబాటు అవుతాయని తేలితే అందుకు అనుగుణంగా ఫైనల్ ఆన్సర్ కీని సవరిస్తారు. గేట్ 2025 ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ప్రకారం, గేట్ 2025 స్కోర్ కార్డులు మార్చి 28 నుండి మే 31, 2025 వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో

గేట్ 2025 పరీక్షను ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహించారు. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం సెషన్ ఉదయం 9:30 గంటల నుండి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి 3:30 గంటల వరకు జరిగింది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూ), మల్టిపుల్ సెలక్ట్ ప్రశ్నలు (ఎంఎస్ క్యూలు), న్యూమరికల్ ఆన్సర్ టైప్ (నాట్) అనే మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి.

ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

  1. ముందుగా ఐఐటీ గేట్ 2025 అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.
  2. హోమ్ పేజీలో కనిపించే జీఓపీఎస్ అప్లికేషన్ పోర్టల్ లింక్ పై క్లిక్ చేయండి.
  3. మీ లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. మీ రిజల్ట్ చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
  5. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్ మరియు ఆర్ట్స్ / హ్యుమానిటీస్లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్టులపై అభ్యర్థుల సమగ్ర అవగాహనను పరీక్షించే జాతీయ స్థాయి పరీక్ష.
  6. మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని సూచించారు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం