పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ.. విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం-free air travel for students who excelled in ap 10th class results ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ.. విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ.. విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం

విద్యార్థులను ప్రోత్సహించడానికి ఆ ఎంఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. పదో తరగతి ఫలితాల్లో 550 కి పైగా మార్కులు సాధిస్తే.. ఉచితంగా విమానంలో ప్రయాణించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. తాను ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులను విమానం ఎక్కించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యార్థులకు ఉచితంగా విమాన ప్రయాణం (unsplash)

అనతంపురం జిల్లా బెళుగుప్ప మండలంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను.. విమాన ప్రయాణం చేయిస్తానని ఎంఈఓ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల ప్రకటించిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలో ఈశ్వరి, మధుశ్రీ, అర్చన, ఇందు, లావణ్య అనే విద్యార్థినులు 550కిపైగా మార్కులు సాధించారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు..

తాజాగా ఎంఈఓ విద్యార్థినులతో వెళ్లి కలెక్టర్‌ వినోద్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి అనుమతి తీసుకున్నారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు వస్తారు. భాగ్యనగరంలో పర్యాటక ప్రదేశాలను విద్యార్థినులకు చూపించి తీసుకువస్తానని ఎంఈఓ వివరించారు. దీనికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. ఎంఈవో నిర్ణయాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

ముఖ్యమైన అంశాలు..

ఏపీ పదో తరగతి పరీక్షలు 2025 మార్చి 17 నుండి మార్చి 31 వరకు జరిగాయి.

పరీక్షల సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు (కొన్ని పరీక్షలు 11:30 వరకు).

ఏపీ పదో తరగతి ఫలితాలు 2025 ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి.

ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామ రాజు విడుదల చేశారు.

ఈ సంవత్సరం మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు.

మొత్తం ఉత్తీర్ణత 81.14 శాతం

బాలికల ఉత్తీర్ణత శాతం 84.09 కాగా, బాలుర ఉత్తీర్ణత 78.31 శాతంగా ఉంది.

పార్వతీపురం మన్యం జిల్లా అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో ఉంది.

1,680 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

సబ్జెక్టుల వారీగా అత్యధిక ఉత్తీర్ణత శాతం సెకండ్ లాంగ్వేజ్‌లో (99.51 శాతం) నమోదైంది.

మీడియం వారీగా చూస్తే, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 83.19 శాతం ఉత్తీర్ణత సాధించారు.

పునః మూల్యాంకనం లేదా రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 24 నుండి మే 1 వరకు అవకాశం ఇచ్చారు.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుండి మే 28 వరకు జరుగుతాయి.

సంబంధిత కథనం