Flipkart Scholarship: కిరాణా స్టోర్స్ యజమానుల పిల్లలకు రూ.50 వేల ఆర్థికసాయం, ఫ్లిప్ కార్ట్ స్కాలర్ షిప్ దరఖాస్తు ఇలా?
Flipkart Scholarship 2025 : ఫ్లిప్ కార్ట్ సంస్థ కిరాణా స్టోర్స్ యజమానుల పిల్లలకు స్కాలర్ షిప్ లు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులకు రూ. 50 వేల స్కాలర్ షిప్ లు విద్యావసరాలకు అందిస్తుంది. విద్యార్థులు ఏప్రిల్ 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ipkart Scholarship 2025 : ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ రిటైల్ రంగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని ఆ సంస్థ తెలిపింది. రిటైల్ రంగం బలోపేతానికి కిరాణా స్టోర్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ కిరాణా స్టోర్ యజమానుల పిల్లల కోసం స్కాలర్‌షిప్ లు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ 2024-25 ద్వారా అర్హులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మద్దతు ఇస్తుంది. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రొఫెషనల్ STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం) అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో చేరిన మొదటి సంవత్సరం విద్యార్థుల(కిరాణా స్టోర్ యజమానుల పిల్లలు)కు రూ.50,000 స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
- దరఖాస్తుదారులు భారతదేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం) కోర్సుల 1వ సంవత్సరం చదువుతూ ఉండాలి.
- తల్లిదండ్రుల్లో ఒకరు కిరాణా స్టోర్ యజమాని అయి ఉండాలి.
- దరఖాస్తుదారులు తమ 12వ తరగతి పరీక్షలలో కనీసం 60% మార్కులు సాధించాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ. 5 లక్షలకు మించకూడదు.
- ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
స్కాలర్ షిప్ వివరాలు
అర్హులైన విద్యార్థులకు రూ. 50,000 స్కాలర్‌షిప్ అందిస్తారు. స్కాలర్‌షిప్ ఫండ్ ను ట్యూషన్ ఫీజులు, పరీక్ష ఫీజులు, హాస్టల్ ఫీజులు, పుస్తకాలు, స్టేషనరీ, ప్రయాణం, డేటా, ఆహారం, బస మొదలైన వాటితో సహా విద్యా సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగించవచ్చు.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
- ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫొటో
- కాలేజీ/సంస్థ ప్రవేశ రుజువు (అడ్మిషన్ లెటర్/ఐడీ కార్డు)
- 12వ తరగతి మార్కుల జాబితా
- కుటుంబ ఆదాయ రుజువు (ITR, పే స్లిప్పులు, ఆదాయ ధృవీకరణ పత్రం)
- కిరాణా స్టోర్ యజమాని రుజువు (దుకాణాలు, స్థాపన నమోదు చట్టం ప్రకారం సంస్థ నమోదు, GST నమోదు)
- గుర్తింపు రుజువు (పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్)
- ప్రభుత్వ అధికారులు జారీ చేసిన వైకల్య ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
- విద్యా సంవత్సరానికి ఫీజులు, విద్యా ఖర్చుల చెల్లింపు రసీదులు (ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, పుస్తకాలు, మెస్ ఫీజు మొదలైనవి).
- విద్యార్థుల బ్యాంకు పాస్‌బుక్
ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://www.buddy4study.com/page/flipkart-foundation-scholarship-program లింక్ పై క్లిక్ చేయండి.
- హోంపేజీలోని అప్లై నౌ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్డ్ ఐడీతో Buddy4Study కి లాగిన్ అవ్వండి. 'దరఖాస్తు ఫారమ్ పేజీ'లో లాగిన్ అవ్వండి.
- మీ ఈ-మెయిల్/మొబైల్/జి-మెయిల్ ఖాతాతో Buddy4Studyలో నమోదు చేసుకోండి.
- ఇప్పుడు ' ఫ్లిప్‌కార్ట్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ 2024-25' దరఖాస్తు ఫారమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
- 'దరఖాస్తును ప్రారంభించు' బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూర్తి చేయండి.
- సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
- 'నిబంధనలు, షరతులు' అంగీకరించి, 'ప్రివ్యూ' పై క్లిక్ చేయండి.
- అన్ని వివరాలు ప్రివ్యూ స్క్రీన్‌పై సరిచూసుకుని సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
సంబంధిత కథనం