Eluru Jobs : ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తు విధానం ఇలా
Eluru Jobs : ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 3వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తారు
Eluru Jobs : ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ ఫిబ్రవరి 3న నిర్ణయించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏ పోస్టులు ఎన్ని?
మొత్తం 18 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో ఫార్మసిస్టు (కాంట్రాక్ట్)-7, ల్యాబ్ టెక్నిషియన్ (కాంట్రాక్ట్) -1, డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్) -6, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (ఔట్ సోర్సింగ్)- 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు
1. ఫార్మసిస్టు : పదో తరగతి ఉత్తీర్ణత, డి. ఫార్మా లేదా బి.ఫార్మా ఉత్తీర్ణత. ఏపీ ఫార్మా కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
2. ల్యాబ్ టెక్నిషియన్ : డీఎంఎల్‌టీ లేదా బీఎస్సీ (ఎంఎల్‌టీ) పూర్తి చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది పాటు అప్రెంటీస్ చేసి ఇంటర్మీడియట్ ఒకేషనల్ పూర్తి చేసి ఉండాలి. ఏపీపీఎంబీలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి.
3. డేటా ఎంట్రీ ఆపరేటర్ : బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాలి. పీజీడీసీఏ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి.
4. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ : పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
అప్లికేషన్ ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఆ మొత్తాన్ని District Medical and Health Officer, Eluru Distract, Eluru పేరుతో డీడీ తీయాలి.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగానే ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.
వయో పరిమితి
దరఖాస్తుదారుడు 2024 జులై 1 నాటికి 42 ఏళ్లు పూర్తి కాకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్ మెన్, ఎన్‌సీసీ కేటగిరీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఎలా చేయాలి ?
అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s3eccbc87e4b5ce2fe28308fd9f2a7baf3/uploads/2025/01/2025012296.pdf ను క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలతో పాటు దరఖాస్తు ఓపెన్ అవుతోంది. దరఖాస్తును ప్రింట్ తీసుకుని ఖాళీలను పూర్తి చేయాలి. ఆ దరఖాస్తుకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, అప్లికేషన్ ఫీజు చెల్లించిన డీడీ జత చేసి ఫిబ్రవరి 3 తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయంలో సమర్పించాలి.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు