హైదరాబాద్ ఇఫ్లూలో పీహెచ్‌డీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ వివరాలివే-eflu hyderabad phd admission notification 2025 released key details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  హైదరాబాద్ ఇఫ్లూలో పీహెచ్‌డీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ వివరాలివే

హైదరాబాద్ ఇఫ్లూలో పీహెచ్‌డీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ వివరాలివే

హైదరాబాద్‌‌లోని ఇంగ్లీష్ అండ్‌‌ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదలైంది. 2025– 2026 విద్యా సంవత్సరానికి పీహెచ్‌‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 21 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఇఫ్లూలో పీహెచ్‌డీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్‌‌లోని ఇంగ్లీష్ అండ్‌‌ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు జూన్ 21వ తేదీతో పూర్తి కానుంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2025–-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. https://www.efluniversity.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఇఫ్లూలో పీహెచ్డీ ప్రవేశాలు - ముఖ్య వివరాలు:

  • యూనివర్శిటీ : హైదరాబాద్‌‌లోని ఇంగ్లీష్ అండ్‌‌ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ
  • ప్రవేశాలు - పీహెచ్డీ పోగ్రామ్స్
  • విభాగాలు - ఇంగ్లీష్‌‌ లాంగ్వేజ్‌‌ ఎడ్యుకేషన్‌‌, ఇంగ్లీష్‌‌ లిటరేచర్‌‌, లింగ్విస్టిక్స్‌‌ అండ్‌‌ ఫొనెటిక్స్‌‌, ఎడ్యుకేషన్‌‌, ట్రాన్స్‌‌లేషన్‌‌ స్టడీస్‌‌, ఇండియన్‌‌ అండ్‌‌ వరల్డ్‌‌ లిటరేచర్స్‌‌, హిందీ, అరబిక్ లాంగ్వేజ్‌‌ అండ్‌‌ లిటరేచర్‌‌, రష్యన్ లాంగ్వేజ్‌‌ అండ్‌‌ లిటరేచర్‌‌, స్పానిష్ లాంగ్వేజ్‌‌ అండ్‌‌ లిటరేచర్‌, .ఫ్రెంచ్ లాంగ్వేజ్‌‌ అండ్‌‌ లిటరేచర్‌‌, జర్మన్ లాంగ్వేజ్‌‌ అండ్‌‌ లిటరేచర్‌‌
  • అర్హతలు - సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జేఆర్ఎప్, నెట్ వంటి జాతీ అర్హత పరీక్షలో పాసై ఉండాలి.
  • ఎంపిక విధానం - ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాల జాబితాను ప్రకటిస్తారు.
  • దరఖాస్తులు - అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తులు పంపాలి.
  • ఫీజు - జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 250
  • దరఖాస్తులకు తుది గడువు - 21 జూన్, 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.efluniversity.ac.in/
  • సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు - 040-27689733/27689647/27689447( సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సంప్రదింవచ్చు)
  • ఈమెయిల్ అడ్రస్ : admissions@efluniversity.ac.in

ఈ లింక్ పై క్లిక్ చేసి ఇఫ్లూ పీహెచ్డీ నోటిఫికేషన్ తో పాటు కోర్సులు, అర్హతల వివరాలను తెలుసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.