ఏపీ టెన్త్ వాల్యుయేషన్‌లో లోపాలు….! విద్యాశాఖ సీరియస్-education department serious about flaws in ap ssc valuation ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ టెన్త్ వాల్యుయేషన్‌లో లోపాలు….! విద్యాశాఖ సీరియస్

ఏపీ టెన్త్ వాల్యుయేషన్‌లో లోపాలు….! విద్యాశాఖ సీరియస్

ఏపీ పదో తరగతి వాల్యుయేషన్‌లో లోపాలు వెలుగు చూశాయి. రీకౌంటింగ్, రీవెరిఫికోసం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 66,363 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 11,175 జవాబు పత్రాల మార్కుల్లో పలు మార్పులు జరిగినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ వ్యవహారంపై మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు.

ఏపీ పదో తరగతి పరీక్షలు....!

ఏపీ పదో తరగతి వాల్యుయేషన్‌లో లోపాలు చర్చనీయాంశంగా మారాయి. ఫలితాలు విడుదలైన తర్వాత…. రీకౌంటింగ్, రీవెరిఫిషన్ కు ఈ ఏడాది 34,709(66,363 పేపర్లు) మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వీటిల్లో 10,159 మంది విద్యార్థులకు సంబంధించిన 11,175 జవాబుపత్రాల్లో మార్కులు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో 18 శాతం వ్యత్యాసం నమోదైందనట్లు పేర్కొన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తుల విషయంలో…. 2019 లో 19 శాతంగా, 2022లో 20 శాతం, 2023లో 18 శాతం, 2024లో 17 శాతం ఉందని వివరించింది.

  • ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం….. 55,188 (83.16%) పేపర్లలో ఎటువంటి మార్పులు లేవు.
  • 8,863 స్క్రిప్టుల్లో (13.36%) కేవలం 1 నుంచి 5 మార్కుల వ్యత్యాసం ఉంది.
  • 1506 స్క్రిప్టుల్లో (2.27%) 6నుంచి 10 మార్కుల వ్యత్యాసం ఉంది.
  • 343 స్క్రిప్టుల్లో (0.52శాతం) 11నుంచి 15మార్కులు, 163 స్క్రిప్టుల్లో (0.25%) 16 నుంచి 20 మార్కుల వ్యత్యాసం నమోదైంది.
  • 300 స్క్రిప్టుల్లో 20 మార్కులకు పైబడి మార్కుల తేడాను గుర్తించి సరిచేశారు.
  • ఈ ఏడాది మొత్తం మూల్యాంకన జరిగిన 45,96,527 స్క్రిప్టుల్లో వ్యత్యాసం గుర్తించింది 0.0006 శాతం మాత్రమే అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఐదుగురిపై వేటు….!

పదోతరగతి విద్యార్థుల మార్కుల్లో వ్యత్యాసంపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఐదు మందిని సస్పెండ్ చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నేపథ్యంలో…. ఆర్ జెయు కెటిల్లో దరఖాస్తులకు గడువును జూన్ 5 నుంచి జూన్ 10వతేదీ వరకు పొడిగించారు. స్పెషల్ రీఅప్లికేషన్ విండో తెరచి ఉంచాలని విద్యాశాఖ ఆదేశించింది. వచ్చే ఏడాది నుంచి తప్పిదాలను సాధ్యమైనంత తగ్గించేందుకు ఒఎంఆర్ షీటు డిజైన్ లో మార్పులు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం