హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 80 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూన్ 5వ తేదీతో గడువు ముగుస్తుంది.
ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే వారు 2025 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 27 ఏళ్లు ఉండాలి. ఈ పోస్టులను ఈసీఈ/ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ టెలీ కమ్యూనికేషన్, ఈఅండ్ఐ, ఇనుస్ట్రుమెంటేషన్, సీఎస్‌ఈ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, ఈఈఈ/ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 మధ్య జీతం చెల్లిస్తారు.
మొత్తం 80 పోస్టులు ఉండగా.. వీటిలో ఓపెన్ కేటగిరిలో 38 ఉన్నాయి. ఓబీసీ కోటాలో 22, ఈడబ్యూఎస్ కింద 8, ఎస్సీ కోటాలో 10, ఎస్టీ కోటా కింద 2 పోస్టులు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు జూన్ 5వ తేదీతో ముగుస్తుంది.
ఈ పోస్టుల భర్తీ కోసం రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే ఇంటర్వూలకు పిలుస్తారు. 1:4 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చే అభ్యర్థులు… అర్హత పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. ఈ వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత…. రిజల్ట్స్ ప్రకటిస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఉంటాయి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే hrrect@ecil.co.in లేదా madhaviaurorab@ecil.co.in కు మెయిల్ చేయవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://www.ecil.co.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించుకోవచ్చు. ఇక ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయిన తర్వాత… హాల్ టికెట్ విడుదల, పరీక్ష తేదీల వివరాలను ప్రకటిస్తారు.