ECIL Hyderabad Recruitment 2025 : ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ప్రకటన -భారీగా జీతం, కేవలం ఇంటర్య్వూనే..!-ecil hyderabad has released a notification for filling up manager vacancies ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ecil Hyderabad Recruitment 2025 : ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ప్రకటన -భారీగా జీతం, కేవలం ఇంటర్య్వూనే..!

ECIL Hyderabad Recruitment 2025 : ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ ప్రకటన -భారీగా జీతం, కేవలం ఇంటర్య్వూనే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 12, 2025 06:37 AM IST

ECIL Hyderabad Recruitment 2025: హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా 10 మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు జనవరి 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఈసీఐఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు
ఈసీఐఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Electronics Corporation of India Limited) నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా….. 10 మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన వారు… జనవరి 31వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి.

yearly horoscope entry point

ఖాళీల వివరాలు…

ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మొత్తం 10 ఖాళీలు ఉంటే… జనరల్‌ మేనేజర్‌ 4, సీనియర్‌ మేనేజర్‌ 6 ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం కూడా కలిగి ఉండాలి.

భారీగా జీతం…

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు (జనరల్‌ మేనేజర్‌)రూ.1,20,000 నుంచి రూ.2,80,000 మధ్య ఉంటుంది. సీనియర్ మేనేజర్‌ పోస్టులకు రూ.70,000 నుంచి రూ.2,00,000 మధ్య చెల్లిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా… ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ, వేదిక తేదీలను మెయిల్ ద్వారా పంపిస్తారు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ప్రాసెస్..

అభ్యర్థులు https://www.ecil.co.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. అప్లికేషన్ పూర్తి తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని దరఖాస్తు పత్రాలను జోడించి.. డిప్యూటీ జనరల్ మేనేజర్, Human Resources (Recruitment Section), అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, ఈసీఐఎల్, హైదరాబాద్ - 500 062, తెలంగాణకు పంపించాల్సి ఉంటుంది. ఇందుకు ఫిబ్రవరి 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ముఖ్య తేదీలు:

  • ఉద్యోగ ప్రకటన - ఈసీఐఎల్ హైదరాబాద్
  • ఖాళీలు - 10
  • ఉద్యోగాల పేరు - మేనేజర్ పోస్టులు
  • దరఖాస్తులు - ఆన్ లైన్
  • దరఖాస్తులకు చివరి తేదీ - 31 జనవరి 2025
  • హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ - 7 ఫిబ్రవరి 2025
  • ఇంటర్వూలు తేదీలు - త్వరలో ప్రకటిస్తారు. మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.ecil.co.in/jobs.html

Whats_app_banner

సంబంధిత కథనం