ECIL Hyderabad Recruitment 2025 : హైదరాబాద్ ఈసీఐఎల్ లో ఉద్యోగాలు - కేవలం ఇంటర్య్వూనే, దరఖాస్తులకు కొన్నిగంటలే గడువు..!
హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ లో 10 మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఇవాళ్టితో ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. https://www.ecil.co.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. 10 మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ అప్లికేషన్ల ప్రాసెస్ చివరి దశకు చేరింది. అర్హులైన వారు జనవరి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గడువు పొడిగించే అవకాశం లేదు.

ఖాళీల వివరాలు…
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం కూడా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన రిక్రూట్ చేస్తున్నారు.
దరఖాస్తు విధానం….
అభ్యర్థులు ఈసీఐఎల్ హైదరాబాద్ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. అప్లికేషన్ పూర్తి తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని దరఖాస్తు పత్రాలను జోడించి.. “డిప్యూటీ జనరల్ మేనేజర్, Human Resources (Recruitment Section), అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, ఈసీఐఎల్, హైదరాబాద్ - 500 062” చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఇందుకు ఫిబ్రవరి 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
- ఖాళీలు - 10
- ఖాళీల వివరాలు - జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 ఉద్యోగాలు
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు (జనరల్ మేనేజర్)రూ.1,20,000 నుంచి రూ.2,80,000 మధ్య ఉంటుంది. సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.70,000 నుంచి రూ.2,00,000 మధ్య చెల్లిస్తారు.
- దరఖాస్తులు - ఆన్ లైన్
- దరఖాస్తులకు చివరి తేదీ - 31 జనవరి 2025
- హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ - 7 ఫిబ్రవరి 2025
- ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా… ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ, వేదిక తేదీలను మెయిల్ ద్వారా పంపిస్తారు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది.
- ఇంటర్వూలు తేదీలను త్వరలో ప్రకటిస్తారు. మెయిల్ ద్వారా సమాచారం పంపుతారు.
- అధికారిక వెబ్ సైట్ - https://www.ecil.co.in/hr.html
ఈ లింక్ పై క్లిక్ చేస్తే నేరుగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది
సంబంధిత కథనం