AP Medical Jobs : తూర్పుగోదావ‌రి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ‌ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌-east godavari medical department jobs notification released apply online ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Medical Jobs : తూర్పుగోదావ‌రి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ‌ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

AP Medical Jobs : తూర్పుగోదావ‌రి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ‌ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

HT Telugu Desk HT Telugu
Jan 11, 2025 06:00 PM IST

AP Medical Jobs : తూర్పు గోదావ‌రి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్లు విడుదల అయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.

తూర్పుగోదావ‌రి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ‌ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌
తూర్పుగోదావ‌రి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ‌ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

AP Medical Jobs : ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ జ‌న‌వ‌రి 20గా నిర్ణయించారు. ఆస‌క్తి, అర్హత ఉన్నఅభ్యర్థులు స‌కాలంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ల్యాబ్ టెక్నిషియ‌న్‌ గ్రేడ్ -II, ఎఫ్ఎన్‌వో, ఎస్ఏడ‌బ్ల్యూ విభాగాల్లో పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

yearly horoscope entry point

ఎన్ని పోస్టులు?

మొత్తం 61 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. అందులో ల్యాబ్ టెక్నిషియ‌న్ (గ్రేడ్‌-II) - 3, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్ఎన్‌వో)- 20, సెక్యూరిటీ అటెండ‌ర్ కం వాచ్‌మెన్ (ఎస్ఏడబ్ల్యూ) 38 పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత

1. ల్యాబ్ టెక్నిషియ‌న్ (గ్రేడ్‌-II) పోస్టుల‌కు ఇంట‌ర్మీడియ‌ట్‌, ల్యాబ్ టెక్నాల‌జీలో డిప్లొమా, బ్యాచిల‌ర్‌, మాస్టర్ డిగ్రీల్లో ఏదైనా ఉండాలి. లేదంటే ఇంట‌ర్మీడియ‌ట్ వోకేష‌న‌ల్, ఏడాది పాటు అప్రెంటీస్ చేసి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పారా మెడిక‌ల్ బోర్డులో రిజిస్ట్రేష‌న్ అయి ఉండాలి.

2. మహిళా నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్ఎన్‌వో) పోస్టుల‌కు ప‌దో త‌ర‌గ‌తి, లేదా స‌మాన‌మైన అర్హత‌, త‌ప్పనిస‌రిగా ఫ‌స్ట్ ఎయిడ్ స‌ర్టిఫికేట్ ఉండాలి.

3. సెక్యూరిటీ అటెండ‌ర్ కం వాచ్‌మెన్ (ఎస్ఏడబ్ల్యూ) పోస్టులకు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణలై ఉండాలి.

వ‌యో ప‌రిమితి

క‌నీసం 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థుల‌కు ఐదేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థుల‌కు ప‌దేళ్లు స‌డ‌లింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వ‌య‌స్సు దాట‌కూడ‌దు.

అప్లికేష‌న్ ఫీజు

అప్లికేష‌న్ ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థుల‌కు రూ.500 ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగు అభ్యర్థుల‌కు రూ.200 ఉంటుంది. అప్లికేష‌న్ ఫీజును District Medical and Health Officer పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ‌

ఈ పోస్టుల‌ను మార్కులు ఆధారంగానే భ‌ర్తీ చేస్తారు. విద్యా అర్హత‌లోని స‌బ్జెక్టుల్లో మార్కులకు 75 శాతం మార్కులు, అనుభ‌వానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేసిన‌ప్పటి నుండి ఇప్పటి వ‌ర‌కు ఏడాది ఒక మార్కు కేటాయిస్తారు. అలా గ‌రిష్ఠంగా 10 శాతం మార్కులు కేటాయిస్తారు. అనుభ‌వానికి సంబంధించి మార్కుల‌ను కూడా గిరిజ‌న ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్రతి ఆరు నెల‌ల‌కు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్రతి ఆరు నెల‌ల‌కు 2 మార్కులు కేటాయిస్తారు. ప‌ట్టణ ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్రతి ఆరు నెల‌ల‌కు ఒక మార్కు కేటాయిస్తారు.

నోటిఫికేష‌న్ షెడ్యూల్

1. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ : జ‌న‌వ‌రి 20 (సాయంత్రం 5 గంట‌ల‌) వ‌ర‌కు. కేవ‌లం ఆఫీస్ ప‌ని దినాల్లోనే.

2. మెరిట్ లిస్ట్ విడుద‌ల : జ‌న‌వ‌రి 28

3. తుది జాబితా విడుద‌ల : ఫిబ్ర‌వ‌రి 5

4. అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అంద‌జేత : ఫిబ్ర‌వ‌రి 15

ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి?

ద‌ర‌ఖాస్తు ఫార‌మ్ అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://cdn.s3waas.gov.in/s3c74d97b01eae257e44aa9d5bade97baf/uploads/2025/01/2025010651.pdf అందుబాటులో ఉంటుంది. అక్క‌డ నుంచి ద‌ర‌ఖాస్తు ఫార‌మ్ డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేయాలి. ఆ దరఖాస్తుకు సంబంధిత ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జ‌త చేసి కాకినాడ డీఎంహెచ్‌వో కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో జ‌న‌వ‌రి 20 సాయంత్రం 5 గంట‌ల లోపు సమర్పించాలి.

కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్ స‌ర్వీస్ స‌ర్టిఫికేట్ కోసం ఈ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s3c74d97b01eae257e44aa9d5bade97baf/uploads/2025/01/2025010669.pdf క్లిక్ చేస్తే సర్టిఫికేట్ ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఖాళీల‌ను పూర్తి చేసి, వైద్య అధికారితో సంత‌కం చేయించుకోవాలి.

అద‌న‌పు వివ‌రాలకు అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://cdn.s3waas.gov.in/s3c74d97b01eae257e44aa9d5bade97baf/uploads/2025/01/2025010626.pdf సంప్ర‌దిచాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం