Railway Apprentice Recruitment : రైల్వేలో అప్రెంటీస్​ పోస్టులకు రిక్రూట్​మెంట్​- పూర్తి వివరాలు..-east central railway apprentice recruitment 2025 posts eligibility and other details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Railway Apprentice Recruitment : రైల్వేలో అప్రెంటీస్​ పోస్టులకు రిక్రూట్​మెంట్​- పూర్తి వివరాలు..

Railway Apprentice Recruitment : రైల్వేలో అప్రెంటీస్​ పోస్టులకు రిక్రూట్​మెంట్​- పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu
Jan 25, 2025 12:10 PM IST

East Central Railway Apprentice Recruitment 2025 : 1154 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అప్లికేషన్​ ప్రక్రియను ప్రారంభించింది ఈస్ట్ సెంట్రల్ రైల్వే! 2025 ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, వయస్సు పరిమితితో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్​ పోస్టులకు రిక్రూట్​మెంట్​..
ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్​ పోస్టులకు రిక్రూట్​మెంట్​.. (Representative image)

ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి అప్డేట్​! ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అప్లికేషన్​ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు rrcecr.gov.in రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్, ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్​లో భాగంగా సంస్థలోని 1154 పోస్టులను భర్తీ చేయనున్నారు.

yearly horoscope entry point

రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 25న ప్రారంభమై ఫిబ్రవరి 14, 2025తో ముగుస్తుంది. అర్హతలు, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కోసం క్రింద చదవండి.

ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే అప్రెంటీస్​ రిక్రూట్​మెంట్​ అప్లికేషన్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే రిక్రూట్​మెంట్​- ఖాళీల వివరాలు..

1. దానాపూర్ డివిజన్: 675 పోస్టులు

2. ధన్​బాద్ డివిజన్: 156 పోస్టులు

3. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్: 64 పోస్టులు

4. సోన్​పూర్ డివిజన్: 47 పోస్టులు

5. సమస్తిపూర్ డివిజన్: 46 పోస్టులు

6. ప్లాంట్ డిపో/ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ: 29 పోస్టులు

7. క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్/ హర్నౌట్: 110 పోస్టులు

8. మెకానికల్ వర్క్ షాప్ /సమస్తిపూర్ : 27 పోస్టులు

అర్హతలు..

ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే అప్రెటీస్​ రిక్రూట్​మెంట్​ 2025 కోసం సంబంధిత ట్రేడ్​లో గుర్తింపు పొందిన బోర్డు, ఐటీఐ నుంచి కనీసం 50 శాతం మార్కులతో మెట్రిక్ /10వ తరగతి పరీక్ష లేదా తత్సమాన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణులై ఉండాలి (అంటే.. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ / స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నోటిఫైడ్ ట్రేడ్​లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ).

వయోపరిమితి 2025 జనవరి 1 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..

ఒక నిర్దిష్ట డివిజన్ / యూనిట్ నోటిఫికేషన్​కి దరఖాస్తు చేసే అభ్యర్థులందరికీ సంబంధించి తయారు చేసిన మెరిట్ జాబితా ఆధారంగా అప్రెంటిస్​షిప్​ శిక్షణ కోసం సెలక్షన్​ ప్రక్రియ ఎంపిక జరుగుతుంది. మెట్రిక్యూలేషన్​లో కనీసం 50శాతం మార్కులతో పాటు ఐటీఐ పరీక్షకు ఒకే విధమైన వెయిటేజ్​ ఇస్తూ.. మెరిట్​ లిస్ట్​ని తయారు చేస్తారు.

దరఖాస్తు ఫీజు..

రూ.100.

డెబిట్/క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి స్క్రీన్​పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఆన్​లైన్​ పేమెంట్​కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఏవైనా ఉంటే అవి కూడా అప్లై అవుతాయి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఈస్ట్ సెంట్రల్ రైల్వేలోని రైల్వే రిక్రూట్​మెంట్ సెల్ అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

వివరణాత్మక నోటిఫికేషన్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం