రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓకి చెందిన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. డీఆర్డీఓ రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా సంస్థలో మొత్తం 152 పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 18, 2025 అని గుర్తుపెట్టుకోండి. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
డీఆర్‌డీఓలో సైంటిస్ట్ 'బీ': 127 పోస్టులు
ఏడీఏ (ఏడీఏ) లో సైంటిస్ట్/ఇంజినీర్ 'బీ': 9 పోస్టులు
ఎన్‌కాడ్రైడ్ సైంటిస్ట్ 'బీ' పోస్టులు: 16 పోస్టులు
డీఆర్డీఓ రిక్రూట్మెంట్లో పాల్గొనే అర్హులైన అభ్యర్థులను గేట్(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ప్రతి డిసిప్లిన్, కేటగిరీ వారీగా మెరిట్ జాబితా ప్రకారం 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు నిర్దిష్ట గడువులోగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావడానికి తమ సమ్మతిని తెలియజేయాలి. ఆ తర్వాత ఆర్ఏసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ముందుగా నిర్ణయించిన క్యాలెండర్ తేదీల నుంచి తమకు నచ్చిన టెంటెటివ్ ఇంటర్వ్యూ తేదీని ఎంచుకోవచ్చు.
అభ్యర్థుల తుది ఎంపిక పూర్తిగా గేట్ స్కోర్‌కు 80% వెయిటేజ్, వ్యక్తిగత ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 20% వెయిటేజ్ కలిపి, డిసిప్లిన్ వారీగా, కేటగిరీ వారీగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ. 100/- చెల్లించాలి. ఈ రుసుము ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. తిరిగి ఇవ్వరు.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఆర్ఏసీ, డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
డీఆర్డీఓ రిక్రూట్‌మెంట్ 2025- రిజిస్ట్రేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డీఆర్డీఓ రిక్రూట్‌మెంట్ 2025- పూర్తి నోటిఫికేషన్ని చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం