DRDO Internship 2025 : డీఆర్డీవో ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ విడుదల-దరఖాస్తు విధానం, స్టైఫండ్ వివరాలు ఇలా
DRDO Internship 2025 : డీఆర్డీవో ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీవో ల్యాబ్స్, సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు. దరఖాస్తులను విద్యార్థులు వారి కాలేజీ ద్వారా సంబంధిత డీఆర్డీవో సంస్థకు పంపాలి.

DRDO Internship 2025 : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ లకు నోటిఫికేషన్ విడుదలైంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వివిధ ల్యాబ్‌లు, ప్రాజెక్టులకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందించనున్నారు. ఈ స్థానాలను బీఈ/బీటెక్/బీఎస్సీ పూర్తి చేసిన లేదా చదువుతున్న అభ్యర్థులకు డీఆర్డీవో ఇంటర్న్‌షిప్ 2025 లో అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల గురించి, ఇతర సమాచారం కోసం https://www.drdo.gov.in/drdo/ పోర్టల్‌ను సందర్శించవచ్చు.
4 వారాల నుంచి 6 నెలల వరకు
అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ డిగ్రీలు కలిగి ఉన్న విద్యార్థులు, జనరల్ సైన్సెస్‌లో డిగ్రీలు పొందిన విద్యార్థులు డీఆర్డీవోలో ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 19 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. శిక్షణ వ్యవధి సాధారణంగా కోర్సు రకాన్ని బట్టి 4 వారాల నుంచి 6 నెలల వరకు ఉంటుంది.
డీఆర్డీవో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు
- డీఆర్డీవో పరిశోధనలకు సంబంధించిన రంగాలలో ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తారు.
- విద్యార్థులకు రియల్-టైమ్ ప్రాజెక్టులలో పనిచేసే అవకాశం కల్పిస్తారు.
- దరఖాస్తులను విద్యార్థులు వారి కాలేజీ లేదా సంస్థల ద్వారా సంబంధిత డీఆర్డీవో ల్యాబ్ లేదా సంస్థకు పంపాలి.
- అభ్యర్థుల ఎంపిక అందుబాటులో ఉన్న ఖాళీలు, ల్యాబ్ డైరెక్టర్ ఆమోదానికి లోబడి ఉంటుంది.
- డీఆర్డీవో దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రయోగశాలలు, సంస్థలను నిర్వహిస్తోంది.
- డీఆర్డీవో ప్రయోగశాలలో ఇంజినీరింగ్, సైన్స్, సంబంధిత రంగాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తున్నారు.
- ఇంటర్న్‌షిప్ కోసం షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ. 8,000 నుంచి రూ. 15,000 వరకు స్టైఫండ్ ఇస్తారు.
ఇంటర్న్ షిప్ లో ఇంజినీరింగ్, సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులకు రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధిపై ఆచరణాత్మక అవగాహన కల్పిస్తారు. డీఆర్డీవో పరిశోధన కార్యకలాపాలకు సంబంధించిన వివిధ రంగాలపై ఇంటర్న్‌షిప్ శిక్షణ అందిస్తారు. ఇంటర్న్‌లు ల్యాబ్స్/ఎస్టీలలో కొనసాగుతున్న ప్రాజెక్టులతో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు.
సంబంధిత కథనం