ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. విజయవాడలోని డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే వీటిని రెగ్యూలర్ రిక్రూట్ మెంట్ కాకుండా... ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేస్తారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు 2 ఉండగా….కంప్యూటర్ ఆపరేటర్ ఖాళీలు 4 ఉన్నాయి. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు 9 ఉన్నాయి.సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు బీటెక్(సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ) చేసి ఉండాలి. అంతేకాకుండా రెండేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి.
కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేయటంతో పాటు కంప్యూటర్ స్పెషలైజేషన్ ఉండాలి. రెండేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు... ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ స్పెషలైజేషన్ కలిగి ఉండాలి.
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ. 31,500 నెల జీతం చెల్లిస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ కు రూ. 21,500, డేటా ఎంట్రీ ఆపరేట్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.18,500 చెల్లిస్తారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అభ్యర్థులు వయసు 42 ఏళ్లలోపు ఉండాలి. అర్హులైన వాళ్లు... మే 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. అప్లికేషన్ రుసుం కింద రూ. 500 చెల్లించాలి. ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.
అర్హులైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటితో పాటు విద్యా అర్హతలు, ఉత్తీర్ణత శాతం ఆధారంగా ఆధారంగా ప్రాథమికంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. https://drntr.uhsap.in వెబ్ సైట్ లో జాబితాను ఉంచుతారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ను విడుదల చేస్తారు.