AP EAPCET Updates 2025 : ఏపీ విద్యార్థులకు అలర్ట్ - 'ఈఏపీసెట్' సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి-do you know how to download the apeapcet syllabus 2025check these steps ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Eapcet Updates 2025 : ఏపీ విద్యార్థులకు అలర్ట్ - 'ఈఏపీసెట్' సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP EAPCET Updates 2025 : ఏపీ విద్యార్థులకు అలర్ట్ - 'ఈఏపీసెట్' సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP EAPCET(EAMCET) Syllabus Download 2025: ఏపీ ఈఏపీసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. అయితే ఈ ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు….

ఏపీఈపీసెట్ సిలబస్ 2025

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ - 2025కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రవేశాల పరీక్షలకు సంబంధించిన సిలబస్ వివరాలను అధికారులు అందుబాటులో ఉంచారు. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీఈఏపీసెట్ సిలబస్ డౌన్లోడ్ ప్రాసెస్…

  1. ఏపీ ఈఏపీసెట్ - 2025కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈఏపీసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో సిలబస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంజినీరింగ్ స్ట్రీమ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కనిపిస్తుంది.
  3. మీరు ఏ స్ట్రీమ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో… అక్కడ నొక్కాలి. మీకు పీడీఎఫ్ తో కూడిన సిలబస్ ఓపెన్ అవుతుంది.
  4. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఏపీఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఆపరాద రుసుం లేకుండా ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. రూ. 1000 ఆపరాద రుసుంతో మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ. 2 వేల ఫైన్ తో మే 7 వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.10 వేల అపరాధ రుసుంతో మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మే 12 నుంచి హాల్ టికెట్లు….

మే 6 నుంచి 8వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. మే 12వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా వీటిని పొందవచ్చు.

వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష మే 19, 20 తేదీల్లో జరుగుగుతుంది. రోజుకు రెండు విడతలుగా ఉంటుంది. ఇంజినీరింగ్‌ పరీక్ష మే 21 నుంచి 27 వరకు రోజుకు రెండు విడతలుగా నిర్వహిస్తారు.

వ్యవసాయ, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని మే 21న వెల్లడించారు. ఇంజినీరింగ్‌ ప్రాథమిక ‘కీ’ని మే 28న విడుదల చేస్తారు. తుది ‘కీ’ని జూన్‌ 5న ప్రకటిస్తారు. ఆన్ లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి. ఇందుకోసం ఏపీ(46), తెలంగాణలో(02) కలిపి మొత్తం 48 సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం