Govt Jobs : ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు.. మంచి శాలరీ, అప్లికేషన్ ప్రారంభం
DGAFMS Recruitment : డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(DGAFMS) గ్రూప్ సీ కింద వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు dgafms24.onlineapplicationform.orgని సందర్శించి అప్లై చేయవచ్చు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో వివిధ గ్రూప్ సీ పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ dgafms24.onlineapplicationform.orgని సందర్శించాలి. దీని కోసం దరఖాస్తు ప్రక్రియ 7 జనవరి 2025 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 6 ఫిబ్రవరి 2025 రాత్రి 11:59 వరకు ఉంటుంది.
ఏయే పోస్టులకు రిక్రూట్‌మెంట్
అకౌంటెంట్ - 1 పోస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II- 1 పోస్ట్, లోయర్ డివిజన్ క్లర్క్- 11, స్టోర్ కీపర్ - 24, ఫోటోగ్రాఫర్- 1, ఫైర్‌మెన్ - 5, కుక్ - 4, ల్యాబ్ అటెండెంట్- 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 29, ట్రేడ్స్‌మన్ మేట్ - 31, వాషర్‌మెన్ - 2, కార్పెంటర్, జాయినర్ - 2, టిన్‌స్మిత్ - 1 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 113 పోస్టులకు అభ్యర్థులను నియమిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18-30 సంవత్సరాలుగా నిర్ణయించారు. పోస్ట్ ప్రకారం కనీస, గరిష్ట వయోపరిమితి భిన్నంగా ఉంటుంది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు అందిస్తారు.
దరఖాస్తు చేయడానికి, ఫోటోగ్రాఫర్ కోసం సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ, డిప్లొమా ఉండాలి. అభ్యర్థుల విద్యార్హతలు ఒక్కో పోస్టుకు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌లో అర్హత, విద్యార్హతలను తనిఖీ చేయాలి.
జీతాలు
లెవెల్-5 ప్రకారం, అకౌంటెంట్ పోస్టుకు అభ్యర్థులు ప్రతి నెలా రూ. 29,200 నుండి రూ. 92,300 వరకు జీతం పొందుతారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II పోస్ట్ కోసం అభ్యర్థులు లెవెల్-4 ప్రకారం నెలకు రూ. 25,500 నుండి రూ. 81,100 వరకు జీతం వస్తుంది.
లోయర్ డివిజన్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఫైర్‌మెన్, కుక్ పోస్టులకు అభ్యర్థులు లెవల్-2 ప్రకారం రూ.19,900 నుండి రూ.63,200 వరకు నెలవారీ జీతం ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్‌మన్ మేట్, వాషర్‌మన్, కార్పెంటర్ మరియు జాయినర్, టిన్‌స్మిత్ పోస్టులకు అభ్యర్థులు లెవల్-1 ప్రకారం రూ.18,000 నుండి రూ.56,900 వరకు నెలవారీ జీతం పొందుతారు.
ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే.. రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఉంటాయి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ పీడీఎఫ్ ఇక్కడ చూడండి.