సీయూఈటీ యూజీ 2025 ఫలితాల విడుదల; ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్ ను చెక్ చేసుకోండి-cuet ug result 2025 declared heres how to check ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీయూఈటీ యూజీ 2025 ఫలితాల విడుదల; ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్ ను చెక్ చేసుకోండి

సీయూఈటీ యూజీ 2025 ఫలితాల విడుదల; ఈ డైరెక్ట్ లింక్ తో రిజల్ట్ ను చెక్ చేసుకోండి

Sudarshan V HT Telugu

సీయూఈటీ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ కింది దశలు ఫాలో కావాలి.

సీయూఈటీ యూజీ రిజల్ట్ 2025 విడుదల (HT file)

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శుక్రవారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు సీయూఈటీ అధికారిక వెబ్సైట్ cuet.nta.nic.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి ఈ స్కోర్ కార్డ్ చాలా అవసరం. జూలై 1న సీయూఈటీ-యూజీ ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ స్కోర్లను విశ్లేషించుకోవడానికి అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

లాగిన్ క్రెడెన్షియల్స్ అవసరం

వ్యక్తిగత స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులకు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ అవసరం అవుతాయి. మే 13 నుంచి జూన్ 3 వరకు సీబీటీ విధానంలో 13 భాషలు, 23 డొమైన్ సబ్జెక్టులు, జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించారు. పరీక్ష విధానం ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు (ఎంసీక్యూ) ఆధారంగా ఉంది. అభ్యర్థులు ప్రతి సరైన సమాధానానికి ఐదు మార్కులు పొందుతారు, సమాధానం తప్పుగా ఉంటే ఒక మార్కు కోత విధిస్తారు. మే 13, 16 తేదీల్లో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు 2025 జూన్ 2, 2025 జూన్ 4న రీ టెస్ట్ నిర్వహించారు.

ఇలా చెక్ చేసుకోండి

సీయూఈటీ యూజీ 2025 పరీక్ష రాసిన అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  • సీయూఈటీ యూజీ 2025 అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'CUET UG 2025 స్కోర్ కార్డ్/రిజల్ట్ డౌన్ లోడ్' లింక్ పై క్లిక్ చేయండి.
  • లాగిన్ క్రెడెన్షియల్స్, అప్లికేషన్ నెంబరు మరియు పుట్టిన తేదీ లను ఎంటర్ చేయండి. అనంతరం సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • స్క్రీన్ పై మీ ఫలితం కనిపిస్తుంది.
  • భవిష్యత్తు కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఫలితాన్ని డౌన్ లోడ్ చేసుకోండి.
  • ఈ తుది ఫలితాల పునః మూల్యాంకనం/పునఃపరిశీలనకు అవకాశం ఉండదు.
  • దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలను అనుమతించబోమని ఎన్టీఏ తెలిపింది.
  • అప్ డేట్స్ కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా యూనివర్సిటీ వెబ్ సైట్లను సందర్శించాలని సూచించారు.

CUET UG రిజల్ట్ 2025 చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.