CUET UG 2025: సీయూఈటీ యూజీ 2025 కి అప్లై చేయడానికి రేేపే లాస్ట్ డేట్; ఇలా రిజిస్టర్ చేసుకోండి..-cuet ug 2025 registration ends on march 22 apply at cuetntanicin ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Cuet Ug 2025: సీయూఈటీ యూజీ 2025 కి అప్లై చేయడానికి రేేపే లాస్ట్ డేట్; ఇలా రిజిస్టర్ చేసుకోండి..

CUET UG 2025: సీయూఈటీ యూజీ 2025 కి అప్లై చేయడానికి రేేపే లాస్ట్ డేట్; ఇలా రిజిస్టర్ చేసుకోండి..

Sudarshan V HT Telugu

CUET UG 2025: సీయూఈటీ యూజీ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 మార్చి 22న ముగుస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు సీయూఈటీ యూజీ 2025 అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇవ్వబడింది.

సీయూఈటీ యూజీ 2025

CUET UG 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2025 మార్చి 22న సీయూఈటీ యూజీ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగించనుంది. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ - అండర్ గ్రాడ్యుయేట్ () ని నిర్వహిస్తారు. ఈసీయూఈటీ యూజీ 2025 కి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎన్టీఏ సీయూఈటీ యూజీ అధికారిక వెబ్ సైట్ cuet.nta.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

2025 మే 8 నుంచి పరీక్షలు

సీయూఈటీ యూజీ 2025 కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మార్చి 22 కాగా, ఫీజును చెల్లించడానికి చివరి తేదీ మార్చి 23, 2025. కరెక్షన్ విండో మార్చి 24న ప్రారంభమై 2025 మార్చి 26న ముగుస్తుంది. 2025 మే 8 నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో 37 సబ్జెక్టులు ఉంటాయి. మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష జరగనుంది. ఒక్కో పరీక్ష పేపర్ వ్యవధి 60 నిమిషాలు ఉంటుందని, అభ్యర్థుల సంఖ్య, వారి కాంబినేషన్లను బట్టి పలు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుందన్నారు. లాంగ్వేజెస్, జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సహా గరిష్టంగా ఐదు (05) సబ్జెక్టులను అభ్యర్థులు ఎంచుకోవచ్చు.అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుల సంఖ్య ఆధారంగా ఫీజులు లెక్కిస్తారు.

వయోపరిమితి లేదు

సీయూఈటీ (యూజీ) - 2025కు హాజరయ్యేందుకు అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన లేదా 2025లో 12వ తరగతి ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు సీయూఈటీ (యూజీ) - 2025 పరీక్షకు హాజరుకావచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

సీయూఈటీ యూజీ 2025 దరఖాస్తు విధానం

1. ముందుగా సీయూఈటీ యూజీ 2025 అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

2. రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.

3. తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.

4. అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

5. సబ్మిట్ పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.

6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1000, ఓబీసీ అభ్యర్థులకు రూ.900, (ఎన్సీఎల్) / ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.800, భారతదేశం వెలుపల అభ్యర్థులకు రూ.4500 చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీయూఈటీ యూజీ 2025 అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం