సీయూఈటీ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను విడుదల చేసిన ఎన్టీఏ; డైరెక్ట్ లింక్ తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి-cuet ug 2025 nta releases city intimation slip at official website details and direct link here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సీయూఈటీ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను విడుదల చేసిన ఎన్టీఏ; డైరెక్ట్ లింక్ తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

సీయూఈటీ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను విడుదల చేసిన ఎన్టీఏ; డైరెక్ట్ లింక్ తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

Sudarshan V HT Telugu

సీయూఈటీ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను ఎన్టీఏ బుధవారం విడుదల చేసింది. సీయూఈటీ యూజీ 2025 కి అప్లై చేసిన విద్యార్థులు సీయూఈటీ యూజీ 2025 అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ పరీక్ష కేంద్రం ఉన్న సిటీ వివరాలను, అక్కడి ప్రయాణ, వసతి వివరాలను తెలుసుకోవచ్చు.

సీయూఈటీ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ ల విడుదల (HT_PRINT)

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బుధవారం తన అధికారిక వెబ్సైట్ cuet.nta.nic.in లో సిటీ ఎగ్జామినేషన్ స్లిప్ లను విడుదల చేసింది. అడ్వాన్స్ స్లిప్ ద్వారా అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం ఎక్కడ ఉంటుందో తెలుసుకుని ప్రయాణం, వసతిని ప్లాన్ చేసుకోవచ్చు.

సీయూఈటీ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

సీయూఈటీ యూజీ 2025 సిటీ ఎగ్జామినేషన్ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  1. ముందుగా సీయూఈటీ యూజీ 2025 అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయండి.
  2. హోమ్ పేజీ 3లోని 'క్యూఈటీ యూజీ 2025 సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్' లింక్ పై క్లిక్ చేయండి.
  3. మీ అప్లికేషన్ నెంబరు, పుట్టిన తేదీ, స్క్రీన్ పై ప్రదర్శించబడే సెక్యూరిటీ కోడ్ ని నమోదు చేయాలి.
  4. అనంతరం 'సబ్మిట్' పై క్లిక్ చేయండి.
  5. మీ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దానిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
  6. సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ లో ఏవైనా తప్పులు లేదా వ్యత్యాసాలు ఉంటే సరిదిద్దడం కొరకు ఎన్టీఏ హెల్ప్ డెస్క్ కు తెలియజేయాలి.

సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ పై ఈ వివరాలను చెక్ చేయండి

సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ పై ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. సరిగ్గాలేకపోతే ఎన్టీఏ హెల్ప్ డెస్క్ కు తెలియజేయాలి.

  1. అప్లికేషన్ నెంబరు

2. అభ్యర్థి పేరు

3. తండ్రి పేరు

4. లింగం

5. పుట్టిన తేదీ

6. కేటగిరీ

7. సీయూఈటీ 2025 సబ్జెక్టులు

8. పరీక్ష తేదీ

9. టైమింగ్స్

10. టెస్ట్ సిటీ-స్టేట్

సీయూఈటీ యూజీ 2025 అడ్మిట్ కార్డులు ఎప్పుడు విడుదలవుతాయి?

పరీక్షకు 4 రోజుల ముందు అభ్యర్థుల సీయూఈటీ యూజీ 2025 అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు.

సీయూఈటీ యూజీ 2025 పరీక్ష షెడ్యూల్

సీయూఈటీ యూజీ 2025 పరీక్షలు మే 13 నుంచి జూన్ 3, 2025 వరకు జరుగుతాయి. ఈ ప్రవేశ పరీక్షలు రెండు షిఫ్టుల్లో ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు జరుగుతుంది. తొలుత మే 8న ప్రారంభం కావాల్సిన పరీక్ష వాయిదా పడింది.

సీబీటీ ఫార్మాట్ లో

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఫార్మాట్ లో కొన్ని సబ్జెక్టులతో హైబ్రిడ్ విధానంలో, మరికొన్ని పెన్ అండ్ పేపర్ మోడ్ లో జరుగుతాయని, కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు సంస్థలతో కూడిన 250కి పైగా విశ్వవిద్యాలయాలు సీయూఈటీ యూజీ 2025లో పాల్గొంటున్నాయి.

సీయూఈటీ యూజీ 2025: ఎంత మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు?

ఈ ఏడాది సీయూఈటీ యూజీ 2025 పరీక్షకు దాదాపు 13.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల్లో 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు సీయూఈటీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ కు, ఎనిమిది లక్షల మందికి పైగా విద్యార్థులు సీయూఈటీ యూజీ జనరల్ టెస్ట్ సబ్జెక్టుకు దరఖాస్తు చేసుకున్నారు.

సీయూఈటీ యూజీ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్ డైరెక్ట్ లింక్

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం