CUET PG Admit Card : సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..-cuet pg admit card 2025 out download link and other details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Cuet Pg Admit Card : సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

CUET PG Admit Card : సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

CUET PG admit card 2025 : సీయూఈటీ పీజీ 2025 అడ్మిట్​ కార్డును ఎన్టీఏ విడుదల చేసింది. అడ్మిట్​ కార్డును ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలి? అన్న ప్రశ్నతో పాటు ఇతర వివరాలను అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోండి..

సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డు విడుదల..

సీయూఈటీ పీజీ అడ్మిట్​ కార్డు 2025ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసింది. మార్చ్​ 26 నుంచి ఏప్రిల్ 1, 2025 వరకు జరిగే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ అడ్మిట్ కార్డును exams.ntaonline.in/CUET-PG/ ఎన్టీఏ సీయూఈటీ పీజీ అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

2025 మార్చ్​ 26 నుంచి 30 వరకు, 2025 ఏప్రిల్ 1 మధ్య జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్ కార్డులు వెబ్సైట్​లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫామ్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి సంబంధిత వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

అడ్మిట్ కార్డులో సూచించిన పరీక్షా కేంద్రంలో రిపోర్టింగ్ సమయం, గేట్ క్లోజింగ్ సమయం, పరీక్ష తేదీ, షిఫ్ట్, పరీక్షా సమయాలు, పరీక్ష వేదికను చెక్​ చేసుకోండి.

సీయూఈటీ పీజీ అడ్మిట్ కార్డు 2025 డౌన్​లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అడ్మిట్ కార్డును ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

1. exams.ntaonline.in/CUET-PG/ ఎన్టీఏ సీయూఈటీ పీజీ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.

2. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న (మార్చ్​ 26 నుంచి ఏప్రిల్ 1 వరకు) సీయూఈటీ పీజీ అడ్మిట్ కార్డు 2025 లింక్​పై క్లిక్ చేయండి.

3. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ వివరాలను నింపడానికి కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

4. సబ్మిట్​ బటన్​పై క్లిక్ చేస్తే మీ అడ్మిట్ కార్డు డిస్​ప్లే అవుతుంది.

5. అడ్మిట్ కార్డును చెక్ చేసి పేజీని డౌన్​లోడ్ చేసుకోవాలి.

6. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.

అర్హత షరతులకు లోబడి అభ్యర్థులకు అడ్మిట్ కార్డును తాత్కాలికంగా జారీ చేస్తారు. అభ్యర్థి అడ్మిట్ కార్డును తారుమారు చేయకూడదు లేదా అందులో చేసిన ఏదైనా ఎంట్రీని మార్చకూడదు.

పరీక్ష రోజున, అడ్మిట్ కార్డులో పేర్కొన్న రిపోర్టింగ్ సమయానికి పరీక్ష వేదికకు చేరుకోవాలి. కేంద్రం గేట్ క్లోజింగ్ సమయం దాటి రిపోర్ట్ చేస్తే పరీక్షకు అనుమతించరు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. అనేక ప్రీ-ఎగ్జామినేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల సమయానికి రావాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ సీయూఈటీ అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

అధికారిక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సీయూఈటీ యూజీ అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్​ డేట్​..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సీయూఈటీ యూజీ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2025 మార్చ్​ 22న ముగించనుంది. కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీకి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు cuet.nta.nic.in వద్ద సీయూఈటీ యూజీ అధికారిక వెబ్సైట్ ద్వారా లింన్​ని పొందొచ్చు. దరఖాస్తు చేసుకోవాల్సిన లింక్ ఈరోజు రాత్రి 11.50 గంటలకు డీయాక్టివేట్ అవుతుంది.

ఫీజు చెల్లింపునకు చివరితేదీ: మార్చ్​ 23, 2025. కరెక్షన్ విండో మార్చి 24న ప్రారంభమై 2025 మార్చి 26న ముగుస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం