CUET PG 2025 : సీయూఈటీ పీజీ 2025 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 8 వరకే లాస్ట్.. టైమ్ దగ్గర పడుతోంది!
CUET PG 2025 Registration : సీయూఈటీ పీజీ 2025 రిజిస్ట్రేషన్ విండోను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) త్వరలో మూసివేయనుంది. మీరు కూడా సీయూఈటీ పీజీ 2025కు అప్లై చేయాలనుకుంటే వీలైనంత త్వరగా exams.nta.ac.in వెళ్లాలి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ ) రెండు రోజుల తర్వాత సీయూఈటీ పీజీ 2025 రిజిస్ట్రేషన్ విండోను మూసివేయనుంది. కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పీజీ 2025 పరీక్ష ఫారాన్ని నింపడానికి చివరి తేదీని 8 ఫిబ్రవరి 2025 రాత్రి 11:50 గంటల వరకు నిర్ణయించారు. నిజానికి మొదటి దరఖాస్తుకు చివరి తేదీ 1 ఫిబ్రవరి 2025 అని చెప్పి.. తర్వాత 8 ఫిబ్రవరి 2025 వరకు పొడిగించారు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 9 ఫిబ్రవరి 2025 ఉంది. మీరు కూడా సీయూఈటీ పీజీ 2025కు అప్లై చేయాలనుకుంటే వీలైనంత త్వరగా అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
దరఖాస్తు ఫారం నింపడానికి చివరి తేదీ- 2025 ఫిబ్రవరి 8 (రాత్రి 11:50 గంటల వరకు)గా ఉంది. దరఖాస్తు ఫారంలో దిద్దుబాటు- 2025 ఫిబ్రవరి 10 నుంచి 2025 ఫిబ్రవరి 12 వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మార్చి 13 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి. మెుత్తం 157 సబ్జెక్టుల్లో పరీక్ష ఉంటుంది. ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1400 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.700 అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ-ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1200 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.600 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ రెండు పేపర్లకు రూ.1100 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్ కు రూ.600 అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లకు రూ.1000 ఫీజు చెల్లించాలి. భారతదేశం వెలుపలి అభ్యర్థులు రెండు పేపర్లకు రూ .7000 ఫీజు చెల్లించాలి. ఒక్కో పేపర్‌కు రూ.3500 అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
అధికారిక CUET PG వెబ్‌సైట్‌ని సందర్శించండి.
హోమ్‌పేజీలో CUET-PG 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రత్యక్షంగా ఉంది.. లింక్‌పై క్లిక్ చేయండి.
CUET PG 2025 రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
న్యూ రిజిస్టర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి ముందు అన్ని సూచనలను జాగ్రత్తగా చదవండి.
పేర్కొన్న ఫార్మాట్లలో అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
దరఖాస్తు రుసుమును చెల్లించి, భవిష్యత్తు అవసరాల కోసం కాపీని సేవ్ చేయండి.