CUET PG 2025: సీయూఈటీ పీజీ 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం; ఇలా అప్లై చేసుకోండి..!
CUET PG 2025: 2025 సంవత్సరానికి గానూ దేశ వ్యాప్తంగా ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ కోర్సల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష సీయూఈటీ పీజీ 2025 కు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు సీయూఈటీ పీజీ 2025 అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
CUET PG 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2025 జనవరి 2న సీయూఈటీ పీజీ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. సీయూఈటీ పీజీకి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సీయూఈటీ పీజీ 2025 అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
లాస్ట్ డేట్..
అధికారిక ప్రకటన ప్రకారం, సీయూఈటీ పీజీ 2025 కి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 1 ఫిబ్రవరి 2025. కరెక్షన్ విండో ఫిబ్రవరి 3న ప్రారంభమై 2025 ఫిబ్రవరి 5న ముగుస్తుంది. సీయూఈటీ పీజీ పరీక్షను 2025 మార్చి 13 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. సీయూఈటీ (పీజీ)-2025ను విదేశాల్లోని 27 నగరాలతో సహా మొత్తం 312 నగరాల్లో నిర్వహిస్తున్నారు. సీయూఈటీ (పీజీ)-2025లో మొత్తం 157 సబ్జెక్టులను అందిస్తున్నారు. సీయూఈటీ (PG)-2025 ప్రశ్నపత్రంలో లాంగ్వేజెస్, ఎంటెక్/హయ్యర్ సైన్సెస్, ఆచార్య పేపర్లు (హిందూ స్టడీస్, బౌద్ధ దర్శన్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మినహా) మినహా ఇంగ్లిష్, హిందీ (ద్విభాషా) ఉంటాయి. సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ 2025 మార్చి మొదటి వారంలో అందుబాటులో ఉంటాయని, పరీక్ష తేదీకి 4 రోజుల ముందు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది.
సీయూఈటీ పీజీ 2025 కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సీయూఈటీ పీజీ 2025 (cuet pg) కి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా ఎన్టీఏ (NTA) సీయూఈటీ 2025 అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in ను ఓపెన్ చేయండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీయూఈటీ పీజీ 2025 లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
పరీక్ష ఫీజు వివరాలు
జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఒక పరీక్ష పేపర్ కు రూ.700, రెండు పరీక్ష పేపర్లకు రూ.1400 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఓబీసీ-ఎన్సీఎల్/జనరల్-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఒక పేపర్ కు రూ.600, రెండు పరీక్ష పేపర్లకు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు రెండు టెస్ట్ పేపర్లకు రూ.1100, ఒక టెస్ట్ పేపర్ కు రూ.600 చెల్లించాలి. దివ్యాంగులు రెండు టెస్ట్ పేపర్లకు రూ.1000, ఒక టెస్ట్ పేపర్ కు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.