CTET results: సీటెట్ డిసెంబర్ 2024 పరీక్ష ఫలితాలు విడుదల; ఇలా చెక్ చేసుకోండి..
CTET results 2024: సీటెట్ డిసెంబర్ 2024 పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను సీటెట్ అధికారిక వెబ్ సైట్ ctet.nic.in లో తమ రోల్ నంబర్ ను నమోదు చేసి చూసుకోవచ్చు. అలాగే, తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CTET results 2024: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (cbse) 2024 డిసెంబర్లో నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను సీటెట్ అధికారిక వెబ్ సైట్ ctet.nic.in లో తమ రోల్ నంబర్ ను నమోదు చేసి చూసుకోవచ్చు. అలాగే, తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీటెట్ ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ రోల్ నంబర్లను లాగిన్ క్రెడెన్షియల్ గా ఉపయోగించాల్సి ఉంటుంది.
సీటెట్ డిసెంబర్ 2024 రిజల్ట్
ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.
- ముందుగా సీటెట్ అధికారిక వెబ్ సైట్ ctet.nic.in ను ఓపెన్ చేయండి.
- హోం పేజీలో కనిపిస్తున్న డిసెంబర్ ఎగ్జామ్ రిజల్ట్ (exam result) లింక్ ఓపెన్ చేయండి.
- మీ రోల్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- మీ ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది. మీ స్కోర్ కార్డును డౌన్ లోడ్ చేయండి.
డిసెంబర్ 14, 15 తేదీల్లో పరీక్ష
సీటెట్ (CTET) డిసెంబర్ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా డిసెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించారు. ఓఎంఆర్ షీట్ల స్కాన్ చేసిన చిత్రాలతో పాటు ప్రొవిజనల్ ఆన్సర్ కీని జనవరి 1న విడుదల చేశారు. అదే సమయంలో, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించింది. సీటెట్ (CTET) ప్రొవిజనల్ ఆన్సర్ కీ అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఒక్కో ప్రశ్నకు రూ.1,000 చెల్లించి, తెలియజేయవచ్చని తెలిపింది. అభ్యంతరాలను తెలపడానికి తుది గడువును జనవరి 5వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఇచ్చింది. అభ్యర్థులు సమర్పించిన సవాళ్లను సబ్జెక్టు నిపుణులు సమీక్షించి అవసరమైన మార్పులు చేశారని సీబీఎస్ఈ తెలిపింది. అభ్యర్థి గుర్తించిన తప్పును సబ్జెక్టు నిపుణులు అంగీకరిస్తే, విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఆ ప్రశ్నకు ఆ అభ్యర్థి చెల్లించిన ఫీజును తిరిగి చెల్లిస్తామని సీబీఎస్ఈ (cbse) తెలిపింది.