CTET Answer Key 2024: సీటెట్ ఆన్సర్ కీ 2024 ను విడుదల చేసిన సీబీఎస్ఈ; ఇలా చెక్ చేసుకోండి..
CTET Answer Key 2024: సీటెట్ ఆన్సర్ కీ 2024 ని సీబీఎస్ఈ బుధవారం విడుదల చేసింది. సీటెట్ డిసెంబర్ ప్రొవిజనల్ కీ ని సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్ సైట్ ctet.nic.in లో ఈ కింద పేర్కొన్న దశలను ఫాలో కావడం ద్వారా చూసుకోవచ్చు.
CTET Answer Key 2024: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సీటెట్ ఆన్సర్ కీ 2024ను బుధవారం విడుదల చేసింది. ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కు హాజరైన అభ్యర్థులు సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్సైట్ ctet.nic.in ద్వారా ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతో పాటు ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను కూడా విడుదల చేశారు.
జనవరి 5 వరకు మాత్రమే అందుబాటులో..
అభ్యర్థుల ఓఎంఆర్ ఆన్సర్ షీట్, ఆన్సర్ కీ 2025 జనవరి 1 నుంచి జనవరి 5 వరకు మాత్రమే వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అభ్యంతరాలు తెలియజేయాలనుకునే అభ్యర్థులు జనవరి 5, 2025 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.1000 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. అభ్యర్థులు వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని బోర్డు స్వీకరిస్తే అంటే ఆన్సర్ కీలో సబ్జెక్టు నిపుణులు ఏవైనా పొరపాట్లు గమనించినట్లయితే విధానపరమైన నిర్ణయం తీసుకొని ఆ అభ్యర్థి చెల్లించిన ఫీజును తిరిగి చెల్లిస్తామని అధికారిక నోటీసులో పేర్కొన్నారు. ఆ రీఫండ్ మొత్తం సంబంధిత క్రెడిట్/ డెబిట్ కార్డు ఖాతాకు ఆన్ లైన్ లో క్రెడిట్ అవుతాయి కాబట్టి, అభ్యర్థులు వారి స్వంత క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డు నుండి చెల్లించాలని సూచించారు. సవాళ్లపై బోర్డు నిర్ణయమే అంతిమమని, తదుపరి కమ్యూనికేషన్ ను పరిగణనలోకి తీసుకోబోమని సీబీఎస్ఈ () స్పష్టం చేసింది.
సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీని ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సీబీఎస్ఈ సీటెట్ ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
- ముందుగా సీబీఎస్ఈ సీటెట్ అధికారిక వెబ్సైట్ ctet.nic.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీటెట్ (CTET 2024) ఆన్సర్ కీ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ ఆన్సర్ కీ స్క్రీన్ పై కనిపిస్తుంది.
- ఆన్సర్ కీ చెక్ చేసి ఆ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
సీబీఎస్ఈ సీటెట్ 2024 పరీక్ష
సీటెట్ డిసెంబర్ పరీక్షను 2024 డిసెంబర్ 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో సీబీఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీబీఎస్ఈ (CBSE) సీటెట్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.