CSIR NGRI Hyderabad Jobs 2025 : హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు - భారీగా జీతం..! ముఖ్య వివరాలివే-csir ngri hyderabad inviting applications for the scientist jobs details check here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Csir Ngri Hyderabad Jobs 2025 : హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు - భారీగా జీతం..! ముఖ్య వివరాలివే

CSIR NGRI Hyderabad Jobs 2025 : హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు - భారీగా జీతం..! ముఖ్య వివరాలివే

CSIR NGRI Hyderabad Recruitment 2025: హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 19 సైంటిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 21వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు జరుగుతాయి.

హైద‌రాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు

సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం హైద‌రాబాద్‌ లోని సీఎస్ఐఆర్- జాతీయ‌ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 19 ఖాళీలను భర్తీ చేయనుంది. ఓపెన్ కోటాలో 8 ఖాళీలు ఉన్నాయి. మార్చి 17వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా...ఏప్రిల్ 21వ తేదీ(సాయంత్రం 6) వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చారు. రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ,మహిళ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరిలో అర్హులైన వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. విద్యా అర్హతలే కాకుండా పని అనుభవంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియను స్క్రీనింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది.

దరఖాస్తు విధానం ఇలా

  1. అర్హులైన అభ్యర్థులు CSIR-NGRI అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. కెరీర్ సెక్షన్ లోకి వెళ్లి Recruitment of Scientist ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
  3. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత నిర్ణయించిన దరఖాస్తు రుసుంను చెల్లించాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  4. దరఖాస్తు ఫామ్ పూర్తి చేయటంతో పాటు అడిగిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  5. చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - సీఎస్ఐఆర్- జాతీయ‌ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్.
  • ఉద్యోగాలు - సైంటిస్ట్
  • మొత్తం ఖాళీలు - 19
  • వయోపరిమితి - 28 -31 ఏళ్ల లోపు ఉండాలి.
  • అర్హతలు - పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విభాగాల వారీగా ఖాళీలు, వాటి అర్హతలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు.
  • జీతం - నెలకు రూ.1,37,907.
  • ఆన్ లైన్ దరఖాస్తులకు తుది గడువు - 21 ఏప్రిల్, 2025
  • ఎంపిక విధానం - దరఖాస్తుల షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా

ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు….

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం