హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT)లో టెక్నీషియన్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు రేపటితో(డిసెంబర్ 26, 2024) పూర్తి కానుంది. అర్హులైన అబ్యర్థులు https://www.iict.res.in/HOME వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా మొత్తం 29 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ సర్వీస్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పాసై ఉండాలి.
ఈ ఉద్యోగాలకు సంబంధించి 3 పరీక్షలు ఉంటాయి. ఓఎంఆర్ విధానంలో లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీనిపై రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటన జారీ చేస్తుంది.
పేపర్ 1 లో 50 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం వంద మార్కులు కేటాయించారు. ఈ ఎగ్జామ్ లో మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఇక పేపర్ 2 లో జనరల్ అవర్నేస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు ంటాయి. మొత్తం 50 ప్రశ్నలు..150 మార్కులు కేటాయించారు. పేపర్ 3 లో సంబంధిత సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులు కేటాయించారు. పేపర్ 1 లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు కానీ... పేపర్ 2, 3 లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేసి… ఎంపికైన వారిని ప్రకటిస్తారు.
సంబంధిత కథనం