ఏపీ గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 5,6,7,8 తరగతులతో పాటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 25న కామన్ ఎంట్రన్స్‌టెస్ట్ నిర్వహించారు. వీటి ఫలితాలు గత వారం విడుదలయ్యాయి.
ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 25న నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు మే 15న విడుదల అయ్యాయి. పరీక్ష ఫలితాలను విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేసి ద్వారా తెలుసుకోవచ్చు.
ఏపీ గురుకుల పాఠశాలల్లో 5, 6,7,8 వ తరగతులలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులకు అయా పాఠశాలలకు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులను వెబ్ సైటు ద్వారా మే 21వ తేదీ నుంచి తెలుసుకోవచ్చు. పాఠశాలల వారీగా ఎంపికైన విద్యార్థులు మాత్రమే మే 21 నుంచి 30వ తేదీలోగా సంబంధిత పాఠశాలల్లో ప్రవేవాలు పొందవచ్చు.
ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలతో పాటు, ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ఫస్టియర్‌లో ప్రవేశాలకు 1:5 నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ఎంట్రన్స్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు దరఖాస్తులో పేర్కొన్న ఫోన్ నంబరుకు ఎస్.ఎం.ఎస్. ద్వారా సమాచారం పంపుతారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కౌన్సిలింగ్ తేదీలు, ప్రదేశము వివరాలలతో కూడిన కాల్ లెటర్లలో మే 21 నుంచి అందుబాటులో ఉంటాయి. వెబ్ సైటులో కాల్ లెటర్ లు వచ్చిన అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. కాల్ లెటర్ల కోసం ఈ లింకు క్లిక్ చేయండి.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యార్ధులకు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంపీసీ, ఇఇటి కోర్సులకు మే 26వ తేదీన గుంటూరు పాతబస్టాండ్ సమీపంలో ఉన్న పరీక్షా భవన్‌లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన బాలబాలికలకు బైపీసీ/ సిజిటి గ్రూపుల్లో ప్రవేశాలకు గుంటూరులో మే 27న కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన బాలబాలికలకు ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు మే 28న గుంటూరులో కౌన్సిలింగ్ జరుగుతుంది.
రాయలసీమ ప్రాంతానికి చెందిన బాలురకు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంపీసీ, ఇఇటి కోర్సుల్లో ప్రవేశాలకు మే 26వ తేదీన అన్నమయ్య జిల్లా కెవిపల్లి మండలంలోని గ్యారంపల్లి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్‌కాలేజీలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన బాలురకు బైపీసీ/ సిజిటి గ్రూపుల్లో ప్రవేశాలకు మే 27న గ్యారంపల్లి జూనియర్ కాలేజీల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన బాలురకు ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు మే 28న గ్యారంపల్లిలో కౌన్సిలింగ్ జరుగుతుంది.
రాయలసీమ ప్రాంతానికి చెందిన బాలికలకు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఎంపీసీ, ఇఇటి కోర్సుల్లో ప్రవేశాలకు మే 26వ తేదీన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసిలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ జూనియర్‌కాలేజీలో గర్ల్స్ క్యాంపస్‌లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన బాలికలకు బైపీసీ/ సిజిటి గ్రూపుల్లో ప్రవేశాలకు మే 27న బనవాసి, ఎమ్మిగనూరు కాలేజీలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన బాలికలకు ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు మే 28న బనవాసి జూనియర్ కాలేజీలో కౌన్సిలింగ్ జరుగుతుంది.
ఆంధ్రా, రాయలసీ ప్రాంతాలకు చెందిన బాలురకు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ గుంటూరులో నిర్వహిస్తారు. మే 29వ తేదీన గుంటూరు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పరీక్ష భవన్ వద్ద కౌన్సిలింగ్ జరుగుతుంది.
సంబంధిత కథనం