AP RTGS Recruitment : ఏపీ రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్‌లో 66 ఉద్యోగ ఖాళీలు - ఇవిగో వివరాలు-contract jobs in real time governance in ap secretariat ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Rtgs Recruitment : ఏపీ రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్‌లో 66 ఉద్యోగ ఖాళీలు - ఇవిగో వివరాలు

AP RTGS Recruitment : ఏపీ రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్‌లో 66 ఉద్యోగ ఖాళీలు - ఇవిగో వివరాలు

HT Telugu Desk HT Telugu
Jan 18, 2025 10:54 AM IST

AP RTGS Recruitment : ఏపీ రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్‌లో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రకటన జారీ చేసంది. మొత్తం 66 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జ‌న‌వ‌రి 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు
రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సెక్ర‌టేరియ‌ట్‌లో ఉండే రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్‌టీజీఎస్‌)లో ఉద్యోగాల‌ను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుదలైంది. మొత్తం 66 పోస్టులను భ‌ర్తీ చేస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు జ‌న‌వ‌రి 25 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు.

ఆ ఉద్యోగాల‌ను ఏడాది కాలప‌రిమితితో భ‌ర్తీ చేస్తున్నారు. ప‌నితీరు ఆధారంగా కాంట్రాక్టు వ్య‌వ‌ధి పెంచే అవ‌కాశం ఉంది. 66 ఉద్యోగాల‌కు అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హ‌త ఉన్నవారు త‌మ రెజ్యూమ్‌ను మెయిల్ చేసి అప్లై చేసుకోవ‌చ్చు.

పోస్టుల వివరాలు…

మొత్తం 66 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఆర్‌టీజీఎస్‌-2, ఎవేర్ హ‌బ్‌-3, ఆర్‌టీజీఎస్ అడ్మినిస్ట్రేష‌న్‌-7, డేటా ఇంటిగ్రేష‌న్ అండ్ అన‌లిటిక్స్ హ‌బ్‌-8, ప్రొడెక్ట్ డ‌వ‌ల‌ప్‌మెంట్ హ‌బ్‌-6, ఏఐ అండ్ టెక్ ఇన్నోవేష‌న్ హ‌బ్‌-10, పీపుల్ ప‌ర్సెప్ష‌న్ హ‌బ్‌-20, మ‌ల్టీ సోర్స్ విజువ‌ల్ ఇంటెలిజెన్స్ హ‌బ్‌ విభాగంలో 10 పోస్టులు ఉన్నాయి.

ఏఏ ఉద్యోగాలు…

1. ఆర్‌టీజీఎస్ : చీఫ్ డేటా & సెక్యూరిటీ ఆఫీసర్ (సీడీఎస్‌వో), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)

2. ఎవేర్ హ‌బ్ : మేనేజర్, డేటా అన‌లిస్ట్ (డెసిసెన్ స‌పోర్ట్ అండ్ పాల‌సీ అనాల‌సిస్‌)

3. ఆర్‌టీజీఎస్ అడ్మినిస్ట్రేష‌న్ : హెచ్ఆర్‌ జనరల్ మేనేజర్, మేనేజర్ - ఆఫీస్ అడ్మిన్ & ప్రొక్యూర్‌మెంట్ (ఆఫీస్ ఆపరేషన్స్ మరియు ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్), బిజినెస్ అనలిస్ట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు.

4. డేటా ఇంటిగ్రేష‌న్ అండ్ అన‌లిటిక్స్ హ‌బ్ : డైరెక్టర్ - డేటా ఇంటిగ్రేషన్ అండ్ అనలిటిక్స్, డేటా ఆర్కిటెక్ట్, డేటా గవర్నెన్స్ మేనేజర్, డేటా సైంటిస్ట్ / అనలిస్ట్, డేటా ఇంజనీర్లు, డేటా సెక్యూరిటీ & కంప్లైయన్స్ మేనేజర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్.

5. ప్రొడెక్ట్ డ‌వ‌ల‌ప్‌మెంట్ హ‌బ్ : ప్రొడెక్ట్ డ‌వ‌ల‌ప్‌మెంట్ హ‌బ్‌ డైరెక్టర్, ప్రొడెక్ట్‌ మేనేజ‌ర్‌, గ‌వ‌ర్న‌మెంట్ సొల్యూష‌న్‌, ఫుల్ స్టాక్ డెవలపర్లు / సీనియర్ డెవలపర్ / టీమ్ లీడ్, మొబైల్ డెవలపర్లు, ప్రొడెక్ట్ డిజైనర్లు, విజువలైజేషన్ డెవలపర్లు, ఫ్రంట్‌ఎండ్ డెవలపర్లు, క్యూఏ & టెస్టింగ్ స్పెష‌లిస్టులు.

6. ఏఐ అండ్ టెక్ ఇన్నోవేష‌న్ హ‌బ్ : ఏఐ అండ్‌ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ డైరెక్టర్, ఎస్ఎంఈ - బిగ్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ & ఏఐ, బ్లాక్‌చెయిన్ ఎక్స్‌ప‌ర్ట్స్‌, క్లౌడ్/ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్లు.

7. పీపుల్ ప‌ర్సెప్ష‌న్ హ‌బ్ : పీపుల్స్ పర్సెప్షన్ హబ్ డైరెక్టర్, కోఆర్డినేటర్ - ఎలక్ట్రానిక్ మీడియా, కోఆర్డినేటర్ - ప్రింట్ మీడియా, కోఆర్డినేటర్ - సోషల్ మీడియా, కోఆర్డినేటర్లు, కంటెంట్ రైటర్, ప్రాజెక్ట్/డిపార్ట్‌మెంట్ కోఆర్డినేటర్లు.

8. మ‌ల్టీ సోర్స్ విజువ‌ల్ ఇంటెలిజెన్స్ హ‌బ్ : డైరెక్టర్, స్పెషలిస్ట్, జీఐఎస్ స్పెషలిస్ట్ (సర్టిఫైడ్ అసోసియేట్ లేదా హయ్యర్), డ్రోన్స్ స్పెషలిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్, క్రౌడ్ సోర్సింగ్ స్పెషలిస్ట్, జీఐఎస్‌ స్పెషలిస్ట్ (స్పేషియల్ స్టాటిస్టిక్స్ లేదా జియో-స్టాటిస్టిక్స్).

ఏ పోస్టుకు ఏఏ అర్హ‌త‌లు, ఎంత‌ అనుభ‌వం ఉండాలి? ఏ మెయిల్ ఐడీకి మెయిల్ చేయాలనే వివ‌రాలకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్ https://rtgs.ap.gov.in/careers.html లింక్ ను చూడొచ్చు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం