ఎయిమ్స్ బీబీనగర్‌లో కన్సల్టెంట్ ఖాళీలు - చివరి తేదీ ఇదే-consultant jobs in aims bibinagar notification details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఎయిమ్స్ బీబీనగర్‌లో కన్సల్టెంట్ ఖాళీలు - చివరి తేదీ ఇదే

ఎయిమ్స్ బీబీనగర్‌లో కన్సల్టెంట్ ఖాళీలు - చివరి తేదీ ఇదే

ఎయిమ్స్ బీబీనగర్‌ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా సీనియర్ ఐటీ కన్సల్టెంట్, సిస్టమ్ ఎనలిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులకు నవంబర్ 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఎయిమ్స్ బీబీనగర్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌ బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది. సీనియర్ ఐటీ కన్సల్టెంట్, సిస్టమ్ ఎనలిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 2 ఖాళీలున్నాయి. https://aiimsbibinagar.edu.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి.

నవంబర్ 11 చివరి తేదీ..

ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు నవంబర్ 11వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ చేసిన అభ్యర్థులు అర్హులవుతారు. పని చేసిన అనుభవం కూడా ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు. ఎంపికైన వారికి మంచి జీతం చెల్లిస్తారు.

అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీ వివరాలను నమోదు చేయాలి. పూర్తి చేసిన ఫారమ్ ను “ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (రిక్రూట్‌మెంట్ సెల్), ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్,బీబీనగర్, హైదరాబాద్ -508126” చిరునామాకు పంపాలి. అంతేకాకుండా అప్లికేషన్ స్కాన్ చేసిన కాపీని “recruitment@aiimsbibinagar.edu.in” కు మెయిల్ చేయాలి. ఏమైనా సందేహాలు ఉన్నా ఇదే మెయిల్ ను సంప్రదించవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం