తమిళనాడు కోయంబత్తూరు జిల్లాకు చెందిన కవల సోదరీమణులు కవిత, కనిక తాజాగా విడుదలైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో 93.80 శాతం సమాన మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు. వారు రామనాథపురానికి చెందిన సుందరరాజన్, భారతి సెల్వి దంపతుల కుమార్తెలు. రామనాథపురం మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు. అన్ని సబ్జెక్టుల్లో మార్కులు కలిపితే ఒకే స్కోరు వచ్చింది.
ఈ కవల సోదరీమణులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో ఒకే మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పరీక్ష ఫలితాలు చెక్ చేసుకునేందుకు వెళ్లిన ఇద్దరూ రిజల్ట్ చూసి షాక్ అయ్యారు. కొన్ని నిమిషాలు నివ్వెరపోయారు. దీనికి కారణం వారిద్దరికీ ఒకే స్కోరు రావడమే.
కవిత మార్కులు ఈ కిందది విధంగా ఉన్నాయి. తమిళం - 95, ఇంగ్లీష్ - 98, గణితం - 94, సైన్స్ - 89, సోషల్ సైన్స్ - 98, మొత్తం 474 మార్కులు.
కనిక మార్కులు చూసుకుంటే తమిళం - 96, ఇంగ్లీష్ - 97, గణితం - 94, సైన్స్ - 92, సోషల్ సైన్స్ - 95, మొత్తం 474 మార్కులు వచ్చాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారిద్దరూ గణితంలో ఒకే మార్కులు సాధించారు.
ఇద్దరికీ ఒకే మార్కులు వస్తాయని తాము ఊహించలేదని చెప్పారు కవిత, కనిక. మాకు కూడా ఇలా మార్కులు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. మమ్మల్ని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు అని ట్విన్ సిస్టర్స్ చెప్పుకొచ్చారు.
తమిళనాడులో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. 93.80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం కూడా విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. బాలుర ఉత్తీర్ణత శాతం 91.74 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 95.88 శాతం. 1867 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఈ పబ్లిక్ పరీక్షకు సంబంధించి శివగంగ జిల్లా అత్యధిక ఉత్తీర్ణత రేటుతో తమిళనాడు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. గతసారి మొదటి స్థానంలో నిలిచిన అరియలూర్ జిల్లా ఈ ఏడాది 8వ స్థానానికి వెళ్లింది. వెల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది.