CMAT result 2025 : సీమ్యాట్ 2025 ఫలితాలు విడుదల- పూర్తి వివరాలు..
CMAT result 2025 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సీమ్యాట్ 2025 ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి స్కోర్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్ 2025) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. exams.nta.ac.in/CMAT అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి తమ స్కోర్‌కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సీమ్యాట్ 2025 ఫలితాల డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీమ్యాట్ 2025 ఫలితాలు..
సీమ్యాట్ పరీక్ష జనవరి 25న రెండు షిఫ్టుల్లో 107 కేంద్రాల్లో, 178 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 74,012 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 63,145 మంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు హాజరయ్యారు.
సీమ్యాట్ రెండు షిఫ్టుల్లో నిర్వహించినందున, వివిధ షిఫ్టులు/సెషన్లలో అభ్యర్థుల మార్కులను ఈ పద్ధతిని ఉపయోగించి ఎన్టీఏ స్కోర్ (పర్సంటైల్)గా మార్చారు:
సీమ్యాట్ కోసం ఎన్టీఏ స్కోరు = (అభ్యర్థికి సమానంగా లేదా అంతకంటే తక్కువ రా స్కోర్‌తో సెషన్‌కు హాజరైన అభ్యర్థుల సంఖ్య) ÷ (ఆ సెషన్లో హాజరైన మొత్తం అభ్యర్థుల సంఖ్య)
పరీక్ష అనంతరం సీమ్యాట్ ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రాన్ని విడుదల చేసిన ఎన్టీఏ.. అభ్యర్థుల రికార్డు చేసిన సమాధానాలను అధికారిక వెబ్సైట్లో ప్రదర్శించి అభ్యంతరాలు ఉంటే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు తెలియజేయాలని కోరింది.
అభ్యర్థుల సవాళ్లను సబ్జెక్టు నిపుణులు పరిశీలించి తుది ఆన్సర్ కీ తయారీలో ఉపయోగించారు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను రూపొందించారు.
సీమ్యాట్ 2025 మార్కింగ్ స్కీమ్
- సీమ్యాట్ పరీక్షలో అడిగే ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి.
- ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు (+4) ఇస్తారు.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు (-1) కట్ చేస్తారు.
- జవాబు లేని లేదా ప్రయత్నించని ప్రశ్నలకు మార్కులు ఉండవు.
- మల్టిపుల్ ఆప్షన్స్ సరిగ్గా ఉంటే ప్రశ్నను సరిగ్గా ప్రయత్నించిన వారికి పూర్తి మార్కులు వస్తాయి.
- ఒక ప్రశ్నను తొలగిస్తే అభ్యర్థులందరికీ పూర్తి మార్కులు వస్తాయి.
సీమ్యాట్ 2025: టై బ్రేకింగ్ రూల్..
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్కులు సాధించినట్లయితే, ఇలా చేస్తారు..
- ఒకే స్కోర్ సాధించిన విద్యార్థుల పుట్టిన తేదీలను పరిగణలోకి తీసుకుని జాబితా చేశారు.
- అదే స్కోర్ ఉన్న అభ్యర్థులకు అదే మెరిట్ ఇచ్చి మెరిట్ సంఖ్యను పెంచారు. అంటే ఇద్దరు అభ్యర్థులు 2వ ర్యాంక్‌లో ఉంటే ఇద్దరికీ 2వ ర్యాంక్ ఇచ్చారు. 3వ ర్యాంక్ తర్వాతి అభ్యర్థికి ఇవ్వలేదు. దానికి బదులుగా 4వ ర్యాంకు వచ్చింది.
సీమ్యాట్ ఫలితాల గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.
సంబంధిత కథనం