CLAT Result 2025 : క్లాట్ ఫలితాలు విడుదల- స్కోర్ కార్డును ఇలా చెక్ చేసుకోండి..
CLAT 2025 results out : క్లాట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ స్కోర్ కార్డును అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
క్లాట్ 2025 కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఫలితాలను విడుదల చేసింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2025కు హాజరైన అభ్యర్థులు consortiumofnlus.ac.in క్లాట్ అధికారిక వెబ్సైట్లో తమ స్కోర్‌కార్డును చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
క్లాట్ 2025 పరీక్ష 2024 డిసెంబర్ 1న ఆఫ్‌లైన్ మోడ్‌లో జరిగింది. భారతదేశంలోని 25 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 141 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో ఈ పరీక్షను నిర్వహించారు.
అధికారిక నోటీసు ప్రకారం.. క్లాట్ 2025 స్కోర్లను 2024 డిసెంబర్ 05, 06 న జాబితా చేసి ధృవీకరించారు. వాటిని 2024 డిసెంబర్ 07 న ఎన్ఎల్యూల కన్సార్టియం ("కన్సార్టియం") ఎగ్జిక్యూటివ్ కమిటీ, గవర్నింగ్ బాడీ ముందు వారి పరిశీలన, ఆమోదం కోసం ఉంచారు. కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ, గవర్నింగ్ బాడీ దీనికి ఆమోదం తెలిపాయి. అనంతరం ఫలితాలు వెలువడ్డాయి.
క్లాట్ రిజల్ట్ 2025 చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోండి..
రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ స్టెప్స్‌ని అనుసరించి స్కోర్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- consortiumofnlus.ac.in క్లాట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న క్లాట్ 2025 రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- సబ్మీట్ మీద క్లిక్ చేస్తే మీ స్కోర్ కార్డ్ డిస్ప్లే అవుతుంది.
- స్కోర్ కార్డ్ చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.
ఈసారి క్లాట్ 2025 మొత్తం హాజరు 96.33%. వీరిలో 57% మంది మహిళలు, 43% మంది పురుషులు, 9 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) అనేది భారతదేశంలోని 24 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) లా ప్రోగ్రామ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష.
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు క్లాట్ 2025 స్కోర్ల ఆధారంగా 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల ప్రక్రియను నిర్వహిస్తాయి. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు డిసెంబర్ 9, 2024 సాయంత్రం 4 గంటలకు అందుబాటులో ఉంటాయి. వాటిని మేము మీకు అప్డేట్ చేస్తాము.
అధికారిక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం