సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) కానిస్టేబుల్/ ట్రేడ్స్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 1161 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 5న ప్రారంభమై 2025 ఏప్రిల్ 3న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.
1. కానిస్టేబుల్/ కుక్: 493 పోస్టులు
2. కానిస్టేబుల్/ కాబ్లర్: 9 పోస్టులు
3. కానిస్టేబుల్/టైలర్: 23 పోస్టులు
4. కానిస్టేబుల్/ బార్బర్: 199 పోస్టులు
5. కానిస్టేబుల్/ వాషర్ మ్యాన్: 262 పోస్టులు
6. కానిస్టేబుల్/ స్వీపర్: 152 పోస్టులు
7. కానిస్టేబుల్/ పెయింటర్: 2 పోస్టులు
8. కానిస్టేబుల్/ కార్పెంటర్: 9 పోస్టులు
9. కానిస్టేబుల్/ మాలి: 4 పోస్టులు
10. కానిస్టేబుల్/ ఎలక్ట్రీషియన్: 4 పోస్టులు
11. కానిస్టేబుల్/ వెల్డర్: 1 పోస్టు
12. కానిస్టేబుల్/ ఛార్జ్ మెకానిక్: 1 పోస్టు
13. కానిస్టేబుల్/ఎంపీ అటెండెంట్: 2 పోస్టులు
ఈ నోటిఫికేషన్ లోని పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఆన్ లైన్ దరఖాస్తు కు చివరి తేదీలోగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన అర్హత పొంది ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (ITI) లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యంత ఇస్తారు. అభ్యర్థుల వయోపరిమితి 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ పరీక్షలన్నింటినీ సీఐఎస్ఎఫ్ వివిధ రిక్రూట్మెంట్ సెంటర్లలో నిర్వహిస్తుంది.
యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.
సంబంధిత కథనం