సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు cisfrectt.cisf.gov.in సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 403 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సీఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 18న ప్రారంభమైంది. జూన్ 6, 2025 వరకు అప్లికేషన్ దాఖలు చేయవచ్చు.
విద్యార్హత- పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు క్రీడలు, అథ్లెటిక్స్‌లో రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
వయస్సు- 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02/08/2002 కంటే ముందు- 01/08/2007 తర్వాత జన్మించి ఉండాలి.
మొదటి దశ:
ఎ) ట్రయల్ టెస్ట్
బి) ప్రొఫిషియెన్సీ టెస్ట్
సి) ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ)
డి) డాక్యుమెంటేషన్
2. రెండో దశ
మెడికల్ ఎగ్జామినేషన్
ట్రయల్ టెస్ట్: సెంటర్లో అభ్యర్థులు రిపోర్ట్ చేసిన వెంటనే రిక్రూట్మెంట్ బోర్డు అడ్మిట్ కార్డులో ఉన్న ఫొటో, సంతకంతో పాటు ఫొటోతో కూడిన ఐడెంటిటీ ప్రూఫ్ ద్వారా అభ్యర్థుల గుర్తింపును ధ్రువీకరిస్తుంది. ఐడీ అంటే.. ఆధార్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, యూనివర్శిటీ/కాలేజ్/స్కూల్ జారీ చేసిన ఐడీ కార్డు మొదలైనవి.
యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100/
మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఆన్లైన్ విధానంలో చెల్లింపులు జరపాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
వివరణాత్మక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సౌత్ ఇడియన్ బ్యాంక్ (ఎస్ఐబీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని జారీ చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎస్ఐబీ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ని దాఖలు (మే 19 నుంచి) చేసుకోవచ్చు. జూనియర్ ఆఫీసర్/ బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ దఫా రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం