CISF Constable Recruitment : సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ షురూ.. ఇలా అప్లై చేసుకోండి..-cisf constable recruitment 2024 registration begins see how to apply and other details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Cisf Constable Recruitment : సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ షురూ.. ఇలా అప్లై చేసుకోండి..

CISF Constable Recruitment : సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ షురూ.. ఇలా అప్లై చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Feb 04, 2025 07:20 AM IST

CISF Constable Recruitment apply online : సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ అప్లికేషన్​ ప్రక్రియ మొదలైంది. ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? విద్యార్హత ఏంటి? ఎన్ని పోస్టులు ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్..
సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్..

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తన అధికారిక వెబ్​సైట్​లో కానిస్టేబుల్/ డ్రైవర్ పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు cisfrectt.cisf.gov.in అధికారిక వెబ్​సైట్​లో అప్లికేషన్​ ఫామ్​ ఫిల్​ చేయాలి.

yearly horoscope entry point

సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్ డ్రైవ్ గురించి..

ఈ సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1124 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను మార్చ్​ 4, 2025లోగా అధికారిక వెబ్​సైట్​లో సమర్పించాలి.

ఈ రిక్రూట్​మెంట్​ ప్రక్రియలో ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ)/ డాక్యుమెంటేషన్/ ట్రేడ్ టెస్ట్/ రాత పరీక్ష/ మెడికల్ ఎగ్జామినేషన్ వంటివి ఉంటాయి.

ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో రాత పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహిస్తారు. పీఈటీ/పీఎస్టీ, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ సమయంలో ఒరిజినల్స్​తో పాటు అవసరమైన అర్హత సర్టిఫికెట్లు/ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ జరుగుతుందని అధికారిక నోటీసులో పేర్కొన్నారు.

పోస్టుల వివరాలు..

కానిస్టేబుల్/డ్రైవర్ - డైరెక్ట్: 845 పోస్టులు

కానిస్టేబుల్/(డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్) (ఫైర్ సర్వీసెస్ డ్రైవర్) -డైరెక్ట్: 279 పోస్టులు

విద్యార్హత- వయస్సు..

సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

అభ్యర్థుల వయసు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం, వయోపరిమితిని నిర్ణయించడానికి కీలకమైన కటాఫ్ తేదీ మార్చ్​ 4, 2025.

దరఖాస్తు ఫీజు:

యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్ఎం కేటగిరీల అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

క్రెడిట్ లేదా డెబిట్ లేదా రూపే కార్డులు, యూపీఐని ఉపయోగించడం ద్వారా నెట్ బ్యాంకింగ్​తో ఆన్​లైన్​ లేదా ఎస్బీఐ చలానా జనరేట్ చేయడం ద్వారా, ఎస్బీఐ శాఖల్లో నగదు చెల్లించడం ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పైన పేర్కొన్న విధంగా కాకుండా ఇతర పద్ధతుల ద్వారా చెల్లించిన రుసుమును ఆమోదించరు.

ఇలా అప్లై చేసుకోండి..

  • cisfrectt.cisf.gov.in అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో, మీరు నమోదు చేసుకోవడానికి కొత్త రిజిస్ట్రేషన్ ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • మీ క్రెడెన్షియల్స్​తో లాగిన్ అయి సబ్మిట్ చేయండి.
  • అప్లికేషన్ ఫామ్ నింపి, అవసరమైతే అవసరమైన డాక్యుమెంట్లను అప్​లోడ్ చేసి, ఆన్​లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ధృవీకరణ పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం దాని ప్రింటౌట్​ని తీసుకోండి.

ఆన్​లైన్​ దరఖాస్తుకు చివరి తేది: 04/03/2025 (రాత్రి 11 గంటల 59 నిమిషాలు)

మరింత సమాచారం కోసం అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి.

Whats_app_banner

సంబంధిత కథనం