సీఐఎస్‌ఎఫ్‌లో చేరాలని అనుకునే యువతకు గుడ్‌న్యూస్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్/డ్రైవర్ కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ 3 ఫిబ్రవరి 2025 నుండి మెుదలవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ 4 మార్చి 2025 వరకు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు cisfrectt.cisf.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్‌లో చేరడానికి, అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా హెవీ మోటార్ వెహికల్(HMV), ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ (TV) లేదా లైట్ మోటార్ వెహికల్ (LMV) చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో ఉండాలి.
ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. వయస్సు మార్చి 4, 2025 నాటికి లెక్కిస్తారని గుర్తుంచుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చూడాలి.
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే తీసుకుంటారు. ఆసక్తిగల అభ్యర్థులు సీఐఎస్ఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. దరఖాస్తు ఫారమ్‌తో పాటు నిర్ణీత రుసుమును కూడా చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించవలసి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి రిక్రూట్‌మెంట్ వంటివి ఉంటాయి. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 1,124 పోస్టులను నియమించనున్నారు. వీటిలో 845 పోస్టులు కానిస్టేబుల్/డ్రైవర్, 279 పోస్టులు కానిస్టేబుల్/డ్రైవర్(పంప్ ఆపరేటర్) కోసం ఉంటాయి. సీఐఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం సాధించాలనే వారికి ఇది మంచి అవకాశం కానుంది.
టాపిక్