JEE mains 2025 : ఈ టిప్స్​ పాటిస్తే జేఈఈ మెయిన్స్​లో నెగిటివ్​ మార్కులకు చెక్​!-check out these effective jee mains 2025 preparation tips to reduce negative marks ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Jee Mains 2025 : ఈ టిప్స్​ పాటిస్తే జేఈఈ మెయిన్స్​లో నెగిటివ్​ మార్కులకు చెక్​!

JEE mains 2025 : ఈ టిప్స్​ పాటిస్తే జేఈఈ మెయిన్స్​లో నెగిటివ్​ మార్కులకు చెక్​!

Sharath Chitturi HT Telugu
Jan 13, 2025 06:42 AM IST

JEE mains 2025 preparation tips : జేఈఈ మెయిన్స్​ 2025కి ప్రిపేర్​ అవుతున్నారా? అయితే ఇది మీకోసమే! పరీక్షలో నెగిటివ్​ మార్కుల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే కొన్ని విలువైన టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఈ టిప్స్​ పాటిస్తే నెగిటివ్​ మార్కులకు చెక్​!
ఈ టిప్స్​ పాటిస్తే నెగిటివ్​ మార్కులకు చెక్​!

ఇంకొన్ని రోజుల్లో జేఈఈ (జాయింట్​ ఎంట్రెన్స్​ ఎగ్జామినేషన్​) మెయిన్స్​ సెషన్​ 1 ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రిపరేషన్స్​ చేసుకుంటున్నారు. అయితే, ఈ ఇంజినీరింగ్​ ఎంట్రెన్స్​ ఎగ్జామ్​లో పాజిటివ్​ మార్కులు సాధించడం ఎంత ముఖ్యమో, నెగిటివ్​ మార్క్​ల నుంచి తప్పించుకోవడం కూడా అతే ముఖ్యం! ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్​ 2025లో నెగిటివ్​ మార్కులను తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్ని టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

జేఈఈ మెయిన్స్​ 2025 ప్రిపరేషన్​ టిప్స్​..

ముందు ఎగ్జామ్​ పాటర్న్​ని అర్థం చేసుకోండి : జేఈఈ మెయిన్స్​ 2025లో 300 మార్కుల కోసం 75 ప్రశ్నలు ఉంటాయి. మాథ్స్​, ఫిజిక్స్​, కెమిస్ట్రీ విభాగాలు ఉంటాయి. ప్రతి కరెక్ట్​ సమాధానానికి 3 మార్కులు వస్తాయి. సమాధానం తప్పు అయితే ఒక మార్కు పోతుంది. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎలాంటి పాజిటివ్​, నెగిటివ్​ మార్కులు ఉండవు. పరీక్షలో గెస్​వర్క్​లను తగ్గించేందుకు ఈ జేఈఈ మెయిన్స్​ నెగిటివ్​ మార్కింగ్​ సిస్టెమ్​ని తీసుకొచ్చారు.

ముందు మీకు తెలిసింది చేయండి : ముందు క్వశ్చన్​ పేపర్​ని క్షుణ్ణంగా పరిశీలించండి. మీకు బాగా తెలుసు అన్న ప్రశ్నలను ఎంచుకోండి. వీటితో మీలో కాన్ఫిడెన్స్​ పెరుగుతుంది. కఠిన ప్రశ్నలతో అస్సలు మొదలుపెట్టకండి. టైమ్​ ఎక్కువపడుతుంది. మీ మీద స్ట్రెస్​ పెరుగుతుంది.

గెస్​వర్క్​కి దూరంగా ఉండండి : జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్​ 1లో గెస్​వర్క్​కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నెగిటివ్​ మార్కింగ్​ ఉన్న పరీక్షల్లో గెస్​వర్క్​లు నష్టం చేస్తాయి. తప్పు సమాధానానికి మార్కులు పోతాయి. ప్రతి మార్కు చాలా కీలకం కదా! ప్రశ్నకు సమాధానం తెలిసినా, డౌట్​గా ఉంటే.. దాన్ని స్కిప్​ చేయండి. అక్యురసీ మీద ఫోకస్​ చేయండి. ఇలా చేస్తేనే నెగిటివ్​ మార్క్​ల నుంచి తప్పించుకోగలరు. కచ్చితంగా సమాధానం ఇవ్వాలని అనిపిస్తే, ఎలిమినేషన్​ ప్రాసెస్​ చేపట్టండి. ఒక్కో ఆప్షన్​ని తొలగిస్తూ రండి. ఇలా చేస్తే కరెక్ట్​ సమాధానం ఇచ్చే ఛాన్స్​లు పెరుగుతాయి.

టైమ్​ మేనేజ్​మెంట్​ ముఖ్యం : జేఈఈ మెయిన్స్​ 2025 సెషన్​ 1లో టైమ్​ మేనేజ్​మెంట్​ చాలా కీలకం. 3 గంటల పరీక్షలో ఎఫీషియెన్స్​ చాలా అవసరం. టైమ్​ని మీరు ఎంత బాగా వినియోగించుకోగలిగితే, చివరిలో ఒత్తిడి లేకుండా, నెగిటివ్​ మార్కింగ్​కి సంబంధించిన తప్పులు చేయరు.

పాత పేపర్లను సాల్వ్​ చేయండి : పాత జేఈఈ క్వశ్చన పేపర్స్​ని ప్రాక్టీస్​ చేస్తే మంచిది! పరీక్ష కఠినత్వంపై మీకు అంచనా వస్తుంది. అందుకు తగ్గట్టు ప్రిపేర్​ అవుతారు. జేఈఈ సిలబస్​లో అధిక వెయిటేజ్​ ఉన్న ప్రశ్నలను ఎంచుకోండి. వాటిని సాల్వ్​ చేయండి. మీ స్కోర్​ పెరుగుతుంది. టైమ్​ మిగులుతుంది.

ఫోకస్డ్​గా ఉండండి : ఒత్తిడి, యాంగ్జైటీతో పరీక్షలో తప్పులు జరుగుతాయి. నెగిటివ్​ మార్కులు పడతాయి. అందుకే ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం.

సమాధానాలు మళ్లీ చెక్​ చేసుకోండి : జేఈఈ మెయిన్స్​ సెషన్​ 1లో ఇంకా టైమ్​ మిగిలి ఉంటే, మీ సమాధానాలను మళ్లీ ఒకసారి చూసుకోండి. మీకే మంచిది.

ఈ టెక్నిక్స్​ ఫాలో అయితే నెగిటివ్​ మార్కుల టెన్షన్​ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జేఈఈ మెయిన్స్​ 2025లో మంచి స్కోరు సాధించే అవకాశాలు పెరుగుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం