మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) త్వరలోనే నీట్ పీజీ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన తర్వాత.. విద్యార్థులు దాన్ని కమిటీ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in నుంచి పరిశీలించి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
2025 సంవత్సరానికి గాను, కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు చివరి వారంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో మూడు సాధారణ రౌండ్లు, ఒక స్ట్రే వేకెన్సీ రౌండ్ (మిగిలిపోయిన సీట్ల భర్తీ రౌండ్) ఉంటాయి. మొదటి రౌండ్లలో సీటు దక్కించుకోలేని విద్యార్థులకు తరువాతి రౌండ్లలో అవకాశం కల్పిస్తారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి: సీట్ల కేటాయింపు ప్రక్రియ కోసం, మీరు ప్రతి రౌండ్‌లోనూ నమోదు (రిజిస్టర్) చేసుకోవడం, అవసరమైన వివరాలను పూరించడం తప్పనిసరి.
రౌండ్ల వ్యవధి: మొదటి రౌండ్ సాధారణంగా ఒక నెల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. కానీ తరువాతి రౌండ్లు ఏడు రోజులు మాత్రమే ఉంటాయి!
ఛాయిస్ ఫిల్లింగ్: నీట్ పీజీ 2025 కౌన్సిలింగ్‌కి రిజిస్టర్ చేసుకుని, రుసుము చెల్లించిన తర్వాత, మీరు మీకు నచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లను గరిష్ఠంగా మూడు వరకు ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఛాయిస్ లాకింగ్: ఎంపికలను లాక్ చేయడం అనేది ఒక రోజులోనే పూర్తవుతుంది. ఇది సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది.
కమిటీ సీట్ల కేటాయింపు ఫలితాన్ని సిద్ధం చేసి, దాన్ని తమ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. ఫలితంతో సంతృప్తి చెందిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలతో పాటు తమకు కేటాయించిన కాలేజీకి వెళ్లి ప్రవేశం పొందాలి. సంస్థ, చేరిన విద్యార్థుల వివరాలను ఎంసీసీకి అందించిన తర్వాత, విద్యార్థులు త్వరలో తరగతులకు హాజరు కావచ్చు.
నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2025 ఆగస్టు 3వ తేదీన ఒకే షిఫ్ట్‌లో 301 నగరాల్లోని 1,052 పరీక్షా కేంద్రాలలో జరిగింది. ఈ పరీక్షకు 2.42 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.
స్టెప్ 1- అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in ను సందర్శించండి.
స్టెప్ 2- హోమ్‌పేజీలో (ప్రధాన పేజీలో), "న్యూస్ అండ్ ఈవెంట్స్" విభాగం కింద ఉన్న "పీజీ మెడికల్" ఆపై "నీట్ పీజీ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్" పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- కౌన్సెలింగ్ షెడ్యూల్ ఫైల్ ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది.
స్టెప్ 4- నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియకు నమోదు చేసుకోవడానికి, "క్యాండిడేట్ యాక్టివిటీ" బోర్డు కింద ఉన్న "న్యూ రిజిస్ట్రేషన్ 2025" పై క్లిక్ చేయండి.
స్టెప్ 5- మీ నీట్ పీజీ రోల్ నంబర్, పాస్‌వర్డ్, కౌన్సెలింగ్ రకాన్ని నమోదు చేయండి.
1- ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ దిల్లీ
2- పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
3- క్రిస్టియన్ మెడికల్ కాలేజ్
4- జవహర్‌లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
5- సంజయ్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
6- బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
7- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరు
8- కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ
9- అమృత విశ్వ విద్యాపీఠం
10- కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్
NIRF ర్యాంకింగ్స్ 2025 ప్రకారం దేశంలో అగ్రశ్రేణి దంత కళాశాలలు..
1- ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ దిల్లీ
2 సవీత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్
3 మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్
4 డా. డి. వై. పాటిల్ విద్యాపీఠం
5 మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మణిపాల్
6 ఎ.బి. శెట్టి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్
7 కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ
8 ఎస్.ఆర్.ఎం డెంటల్ కాలేజ్
9 శిక్ష 'ఓ' అనుసంధాన్
10 జేఎస్ఎస్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్
సంబంధిత కథనం