తెలంగాణ సెట్(స్టేట్‌లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) 2024 ఫలితాలు నవంబర్ లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. అర్హత సాధించిన అభ్యర్థులు.... సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించారు.
తెలంగాణ టెట్ అర్హత సాధించిన వారి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. వీరంతా కూడా సర్టిఫికెట్లు పొందటానికి ఓయూ క్యాంపస్ లోని సెట్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌తో చూపించి తీసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గతేడాది నవంబర్ లో టీజీసెట్- 2024 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఫలితాలను ఉంచారు. టీజీసెట్ ఫలితాల్లో 1,884 మంది అర్హత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. ఫలితాలను http://telanganaset.org/ ద్వారా చెక్ చూసుకోవచ్చు.
పరీక్షకు హాజరైన 26,294 వారిలో 1884 మంది అర్హత సాధించారు. అంటే 7.17శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా అందులో మహిళా అభ్యర్థులు 49.79శాతం, పురుషులు 50.21 శాతం మంది క్వాలిఫై సాధించారు.