డిగ్రీ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు.. ఇక్కడ లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి
Central Bank Of India Recruitment 2025 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నడుస్తోంది. అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ I) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మీరు బ్యాంకింగ్ రంగంలో పని చేయాలని కలలు కంటున్నట్లయితే ఇది మంచి ఛాన్స్. దీని కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే జనవరి 30, 2025 నుండి మెుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు 20 ఫిబ్రవరి 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీ వివరాలు
1. ఎస్సీ: 150 పోస్టులు
2. ఎస్టీ: 75 పోస్టులు
3. ఓబీసీ: 270 పోస్టులు
4. ఈడబ్ల్యూఎస్ : 100 పోస్ట్‌లు
5. జనరల్: 405
ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. ఇది జనవరి 1, 2025ని ప్రాతిపదికగా పరిగణించి నిర్ణయిస్తారు. అయితే రిజర్వ్‌డ్ కేటగిరీ (SC/ST/OBC/PWBD)కి చెందిన అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు రుసుము వివిధ కేటగిరీల ప్రకారం నిర్ణయించారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750 కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు రూ.150గా నిర్ణయించారు. ఫీజులను ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించాలి. జీతం రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
ముందుగా ibpsonline.ibps.in/cbicojan25/ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
హోమ్‌పేజీలో కొత్త రిజిస్ట్రేషన్ లింక్ కోసం క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అవసరమైన అన్ని వివరాలను నింపాలి.
మీ ఫోటో, సంతకం స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి.
నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించండి.
దరఖాస్తు ఫారమ్‌ను తనిఖీ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఫారమ్‌ను సమర్పించిన తర్వాత దాని ప్రింట్‌అవుట్‌ను తీసుకోండి.