సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలొ భారీ రిక్రూట్మెంట్; 4500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్; డిగ్రీ ఉంటే చాలు-central bank of india apprentice recruitment 2025 apply for 4500 posts ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలొ భారీ రిక్రూట్మెంట్; 4500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్; డిగ్రీ ఉంటే చాలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలొ భారీ రిక్రూట్మెంట్; 4500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్; డిగ్రీ ఉంటే చాలు

Sudarshan V HT Telugu

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ centralbankofindia.co.in. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 4500 అప్రెంటిస్ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 4500 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్ జూన్ 23

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2025 జూన్ 23. ఫీజు చెల్లించడానికి చివరి తేది: జూన్ 25, 2025. జూలై మొదటి వారంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అర్హతలు ఈ పోస్టుకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి.

వయో పరిమితి ఇతర అర్హతలు

వయోపరిమితి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నాట్స్ పోర్టల్ లో రిజిస్టర్ అయిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపిక విధానం బీఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సీ నిర్వహించే ఆన్లైన్ ఎగ్జామినేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఈ పరీక్షలో అడిగే ప్రశ్నల సంఖ్య 100, గరిష్ఠ మార్కులు 100. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. ఫలానా రాష్ట్రంలోని ట్రైనింగ్ సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆ రాష్ట్రంలోని ఏదైనా ఒక నిర్దిష్ట స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, మాట్లాడటం మరియు అవగాహన) కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు

పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తరువాత మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంగేజ్ మెంట్ కు అనువైన అభ్యర్థులకు ప్రభుత్వ అప్రెంటిస్ షిప్ పోర్టల్స్ ద్వారా డిజిటల్ అప్రెంటిస్ షిప్ కాంట్రాక్టులు జారీ చేస్తారు. దరఖాస్తు ఫీజు పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు రూ.400/+జీఎస్టీ. షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగలు/ మహిళా అభ్యర్థులు/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600/- + జీఎస్టీ, ఇతర అభ్యర్థులందరికీ రూ.800/- + జీఎస్టీ. ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లింపులు జరపాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.