CDAC C-CAT Result 2025: ఈ రోజే సీడీఏసీ సీ-క్యాట్ ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..
CDAC C-CAT Result 2025: సీడీఏసీ సీ-క్యాట్ 2025 ఫలితాలను 2025 జనవరి 24న విడుదల చేయనున్నారు. సీడీఏసీ సీ-క్యాట్ 2025 పరీక్షను జనవరి 11, 12 తేదీల్లో జరిగింది. రిజల్ట్ ను చెక్ చేసుకోవడానికిి ఈ కింద పేర్కొన్న స్టెప్స్ ను ఫాలో కావాలి.
CDAC C-CAT Result 2025: సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ సీడీఏసీ సీ-క్యాట్ ఫలితాలు 2025 జనవరి 24న విడుదల కానున్నాయి. కంప్యూటరైజ్డ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (C-CAT)కు హాజరైన అభ్యర్థులు ఫలితాలను ప్రకటించిన తర్వాత సీడీఏసీ అధికారిక వెబ్సైట్ cdac.in ద్వారా తమ రిజల్ట్ ను తెలుసుకోవచ్చు.

జనవరి 11, 12 తేదీల్లో
సీడ్యాక్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (C-CAT) 2025 జనవరి 11 నుంచి 12 వరకు జరిగింది. పరీక్షలో సెక్షన్ ఎ, సెక్షన్ బి, సెక్షన్ సి అనే మూడు విభాగాలు ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్ ఒక గంట ఉంటుంది. సీ-క్యాట్లోని ప్రతి విభాగంలో 50 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఉంటాయి, వాటిలో ఒకటి మాత్రమే సరైనది. ప్రతి సరైన సమాధానానికి +3 (ప్లస్ 3), ప్రతి తప్పు సమాధానానికి -1 (మైనస్ 1), ప్రయత్నించని ప్రతి ప్రశ్నకు 0 (సున్నా) మార్కులు ఉంటాయి. ఏదైనా ఒక విభాగంలో అభ్యర్థి పొందే గరిష్ట మార్కులు 150.
రెండు షిఫ్టులు, మూడు సెషన్లలో
సీ డ్యాక్ -సీ క్యాట్ (CDAC C-CAT) ప్రతి విభాగానికి రెండు షిఫ్టులు, మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. సెక్షన్ ఎ ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, సెక్షన్ బి ఉదయం 10.45 గంటల నుంచి 11.45 గంటల వరకు, సెక్షన్ సి మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సెక్షన్ సి మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించారు.
- ముందుగా సీడ్యాక్ అధికారిక వెబ్సైట్ cdac.in కు వెళ్లండి.
2. హోమ్ పేజీలో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విభాగానికి వెళ్లాలి.
3. పీజీ డిప్లొమా కోర్సుల ట్యాబ్ పై క్లిక్ చేసి ఆ తర్వాత యాక్ట్స్ హోమ్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
4. ఇంపార్టెంట్ లింక్స్ విభాగంలో సీ-డ్యాక్ క్యాట్ క్యాండిడేట్ లాగిన్ లింక్ పై క్లిక్ చేయాలి.
5. అడిగిన విధంగా ఆధారాలను నమోదు చేయండి.
6. స్క్రీన్ పై సీ-క్యాట్ రిజల్ట్ 2025 కనిపిస్తాయి. వాటిని చెక్ చేసుకోండి.
7. భవిష్యత్ రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ ఉంచుకోవాలి.
సీట్ల కేటాయింపు
షెడ్యూల్ ప్రకారం, మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు జాబితా 2025 జనవరి 31 న వెలువడుతుంది. సీట్ల కేటాయింపు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 2025 ఫిబ్రవరి 6. పీజీ డిప్లొమా కోర్సులు ఫిబ్రవరి 25న ప్రారంభమై 2025 ఆగస్టు 11న ముగుస్తాయి.