TG Inter Exams 2025 : మార్చి 5 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు - అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు
Telangana Inter Exams 2025 : తెలంగాణ ఇంటర్ పరీక్షలు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మార్చి 5వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బోర్డు ఆదేశించింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీతో అన్ని పరీక్షలు ప్రాక్టికల్స్ పూర్తి కానున్నాయి. అయితే వార్షిక పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో… అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అన్ని జిల్లాల డీఈవోవలు, నోడల్ అధికారులతో ఇంటర్ బోర్డు కార్యదర్శి మంగళవారం సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై చర్చించారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కఠినమైన నిఘా ఉంచేలా జిల్లాల వారీగా కస్టోడియన్, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించాలని స్పష్టం చేశారు.
"అనుభవజ్ఞులైన సిబ్బందిని పరీక్షల నిర్వహణకు వినియోగించుకోవాలి. ప్రతి పరీక్షా కేంద్రం సీసీటీవీ పర్యవేక్షణలో ఉండాలి. పరీక్షా సిబ్బంది వివరాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా కచ్చితమైన పరిశీలన జరపాలి. ప్రశ్నాపత్రాల భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది వివరాలను పూర్తిగా పరిశీలించాలి. ఏర్పాట్ల పర్యవేక్షణకు త్వరలోనే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు" అని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య చెప్పారు.
ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:
- మార్చి 5, 2025(బుధవారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1.
- మార్చి 7, 2025(శుక్రవారం)- ఇంగ్లీష్ పేపర్-1.
- మార్చి 11, 2025(మంగళవారం) -మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1.
- మార్చి 13, 2025(గురువారం)-మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1.
- మార్చి 17, 2025 (సోమవారం) -ఫిజిక్స్ పేపర్-1, ఎనకామిక్స్ పేపర్-1.
- మార్చి 19, 2025(బుధవారం) -కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1.
- మార్చి 21,2025(శుక్రవారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
- మార్చి 24, 2025(సోమవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1.
ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:
- మార్చి 6 , 2025(గురువారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2.
- మార్చి 10, 2025(సోమవారం)- ఇంగ్లీష్ పేపర్-2.
- మార్చి 12, 2025(బుధవారం) -మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2.
- మార్చి 15, 2025(శనివారం)-మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
- మార్చి 18, 2025 (మంగళవారం) -ఫిజిక్స్ పేపర్-2, ఎనకామిక్స్ పేపర్-2.
- మార్చి 20, 2025(గురువారం) -కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2.
- మార్చి 22,2025(శనివారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-2(బైపీసీ విద్యార్థులకు)
- మార్చి 25, 2025(మంగళవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2.
సంబంధిత కథనం