CBSE special exam : సీబీఎస్ఈ క్లాస్ 12 విద్యార్థులకు అలర్ట్! పరీక్ష రాసేందుకు మరో ఛాన్స్..
CBSE class 12 exams : క్లాస్12 విద్యార్థులకు కీలక అలర్ట్ ఇచ్చింది సీబీఎస్ఈ. హోలీ వేడుకల వేళ పరీక్ష షెడ్యూల్ అయ్యి ఉండటంతో, విద్యార్థులకు మరొక అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బోర్డు పరీక్షలు రాస్తున్న సీబీఎస్ఈ క్లాస్ 12 విద్యార్థులకు కీలక అలర్ట్! హోలీ వేడుకల కారణంగా మార్చ్ 15న జరగనున్న పరీక్షకు ఎవరైనా హాజరుకాకపోతే, వారి కోసం ‘స్పెషల్’ ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ని జారీ చేసింది.
సీబీఎస్ఈ క్లాస్ 12 స్పెషల్ ఎగ్జామ్..
సాధారణంగా ఈ తరహా సీబీఎస్ఈ స్పెషల్ పరీక్షలను, రెగ్యులర్ ఎగ్జామ్స్ తర్వాత, క్రీడా విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. ఈసారి, మార్చ్ 15న పరీక్ష మిస్ అయ్యే వారిని కూడా నిర్వహించనున్నారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్చ్ 14న హోలీ పండుగను జరుపుకున్నప్పటికీ, కొన్ని చోట్ల మార్చ్ 15న కూడా వేడుకలు ఉంటాయని తమ దృష్టికి వచ్చినట్టు, అందుకే విద్యార్థులకు మరొక అవకాశాన్ని ఇస్తున్నట్టు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.
ఫీడ్‌బ్యాక్ తర్వాత షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని, కానీ మార్చ్ 15న హాజరుకావడం కష్టంగా ఉన్న విద్యార్థులు తర్వాతి తేదీలో పేపర్ రాయడానికి అవకాశం ఇస్తున్నట్టు నిర్ణయించినట్లు భరద్వాజ్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు బోర్డు విధానం ప్రకారం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని, ఈసారి మార్చ్ 15న ఎగ్జామ్ మిస్ అయ్యే విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు వివరించారు.
షెడ్యూల్ ప్రకారం.. మార్చ్ 15న హిందీ కోర్, హిందీ ఎలెక్టివ్ పరీక్షలు జరగనున్నాయి.
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలు..
సీబీఎస్ఈ క్లాస్ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యాయి. దేశవిదేశాల్లోని 8 వేల పాఠశాలల నుంచి 44 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.
పరీక్షల సమగ్రతను కాపాడేందుకు సీబీఎస్ఈ ఈసారి కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. రెగ్యులర్ విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫాం ధరించాలని, ప్రైవేట్ అభ్యర్థులు లేత రంగు దుస్తులను ఎంచుకోవాలని సూచించింది.
మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, కెమెరాలు, అనధికార స్టడీ మెటీరియల్, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, కళ్లజోళ్లు, పౌచ్లతో సహా పరీక్ష హాల్ లోపల నిషేధించిన వస్తువులను లిస్ట్ చేసింది. ముందస్తు అనుమతితో డయాబెటిక్ విద్యార్థులకు తప్ప మరే ఇతరీకి ఆహారం, పానీయాలు అనుమతినివ్వకుండా నిర్ణయం తీసుకుంది.
పదో తరగతి పరీక్షలు మార్చి 18 వరకు కొనసాగనుండగా, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి. పరీక్షా ప్రక్రియను సులభతరం చేయడానికి సీబీఎస్ఈ.. ఈ సంవత్సరం ప్రధాన సబ్జెక్టుల మధ్య తగినంత టైమ్‌ని అందించింది.
అంతేకాదు, బోర్డు పరీక్షలపై తప్పుడు వాదనల వ్యాప్తిని అరికట్టే మార్గాలపై చర్చించడానికి సీబీఎస్ఈ అధికారులతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది.
"సీబీఎస్ఈ పరీక్ష సన్నాహాలు మెరుగ్గా చేస్తుంది. ఈ మేరకు జాతీయ, రాష్ట్ర స్థాయిలోని అన్ని ప్రభుత్వ యంత్రాంగాల నుంచి సహకారం తీసుకుంటున్నాము. సోషల్ మీడియాలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలపై తప్పుడు వాదనల వ్యాప్తిని పరిష్కరించడానికి మేము సీఈఆర్టీ-ఇన్ అధికారులు, వివిధ సోషల్ మీడియా దిగ్గజాల అధిపతులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశాము." అని ఒక సీబీఎస్ఈ అధికారి కొన్ని రోజుల క్రితం వెల్లడించారు.
సంబంధిత కథనం